/rtv/media/media_files/2025/04/01/lvHFoLyxn2zIqmhKUg1S.jpg)
HCU Hyderabad
HCH:HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు. గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని చెప్పారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది లేదన్నారు.
వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే..
ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వం ఇక్కడ చేపట్టే ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా రాజకీయ నాయకులేనని, కొందరు స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘2003 జనవరి 13న నాటి ప్రభుత్వం ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు మెమో నం.39612/ఏఎస్‌ఎస్‌ఎన్/వి(2) 2003 ప్రకారం కంచ గచ్చిబౌలి గ్రామంలోని భూమిని కేటాయించింది. ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న కేటాయింపును రద్దు(నం.111080/ఎస్1/2003) చేసి ఏపీ యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంటుకు కేటాయించింది' అని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజలకు ఆస్తిగా ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన 534.28 ఎకరాల భూమిని 2024 ఫిబ్రవరి 03న రెవిన్యూ అధికారులకు అప్పగించగా, వారు గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36 లో 191.36 ఎకరాలు సర్వేనెంబర్ 37 లో 205.20 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి అప్పగించి భూ బదలాయింపు చేసుకున్నారని భూ బదలాయింపు జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు ప్రాతినిథ్యం వహించిన ఐఎం జి ఫ్లోరిడాకు చెందిన ఐఎంజి భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించారని, ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా కోట్లాది విలువైన 400 ఎకరాల భూమిని ఐఎంజి భారత్ కు కేటాయించడాన్ని రద్దు చేశారని తెలిపారు.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
మరోవైపు ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
: land | cm revanth | sridhar-babu | telugu-news | today telugu news