Harish Rao : రేవంత్ నువ్వే నా మీద పోటీ చేయ్ .. హరీష్ సవాల్!

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు.  సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్‌రెడ్డే పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలో  పోటీకి ఆయన్ను ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

New Update
harish rao (1)

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) సవాల్ విసిరారు.  సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్‌రెడ్డే పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట(siddipet) లో  పోటీకి ఆయన్ను ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ చేసిన హరీష్ ఈ కామెంట్స్ చేశారు. 

Also Read :  కవిత కొత్త పార్టీ..  ముహుర్తం ఖరారు..ఎప్పుడు, ఎక్కడంటే ?

పగటి కలలు కంటున్నారు

రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలవడం, మళ్లీ సీఎం కావడం అసాధ్యమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి, కేవలం మాటలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని హరీష్ రావు చెప్పుకొచ్చారు. 

కాగా ఇటీవల సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందిని సిద్దిపేటలో గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ తెలిపారు.  ఈక్రమంలో తాజాగా హరీశ్‌రావు స్పందిచారు. 

Also Read :  అల్వాల్‌లో దారుణం.. తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు!

Advertisment
తాజా కథనాలు