Gulf: గల్ఫ్‌ ఏజెంట్ భారీ మోసం.. కార్మికుల పేర్లమీద లోన్లు తీసి!

దుబాయ్‌లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. 

New Update
dubai agent

Gulf agent cheated workers in Telangana

Gulf Agent: తెలంగాణలో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ భారీ మోసానికి పాల్పడ్డాడు. ఉద్యోగం, భారీ జీతం పేరిట వందలమందిని ఏడారి దేశం తీసుకెళ్లి నట్టేటా ముంచేశాడు. దుబాయ్ బ్యాంకుల్లో అమాయకులపేర్లమీద లక్షల్లో లోన్లు తీసి.. కొద్ది రోజుల్లోనే వారందరినీ భయాందోళనకు గురిచేసి ఇంటికి పంపించాడు. గ్రామానికి చేరిన వారంలోనే EMI కట్టాలంటూ దుబాయ్ బ్యాంకుల నుంచి ఫోన్లు రావడంతో ఉలిక్కిపడ్డారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో న్యాయం చేయాలంటూ నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, నిర్మల్‌ ప్రాంతాలకు చెందిన 80 మంది ప్రజాభవన్‌లోని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించగా సంచలన నిజాలు బయటపడ్డాయి. 

విజిట్‌ వీసాపై తీసుకెళ్లి..

ఈ మేరకు నిజామాబాద్‌ దుండిగుళ్ల భూమేశ్వర్‌ ప్రాంతానికి చెందిన 80 మందిపి విజిట్‌ వీసాపై ఓ ఏజెంట్ గల్ఫ్‌ తీసుకెళ్లాడు. ముందగా కొన్ని నెలలు పలు కంపెనీల్లో ఉద్యోగం, వసతి ఇప్పించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇజ్రాయెల్‌లో భారీ జీతాలిస్తారని, పని కూడా తక్కువనేంటూ నమ్మించాడు. ఇందుకోసం అగ్రిమెంట్ ఉంటుందని, వాటిపై సంతకం చేయాలంటూ బ్యాంకు పేపర్లపై వేలుముద్రలు వేయించాడు. దుబాయ్ లో తనకు ఒక సబ్‌ ఏజెంట్‌ను నియమించుకుని.. 30 మంది పేర్లమీద ఒక్కొక్కిరికి రూ.6 లక్షలు మొత్తం రూ.30 లక్షల తీసుకున్నాడు. హవాలా మార్గంలో ఆ డబ్బును ఇంటికి పంపించేవాడు. 

ఇది కూడా చదవండి: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

EMI కట్టాలంటూ దుబాయ్ నుంచి ఫోన్లు..

అయితే నెలలు గడుస్తుంటంతో ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బాధితులంతా ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో పలు కారణాల వల్ల ఉద్యోగాలు రాలేదని, అందరూ ఇండియాకు తిరిగివెళ్లిపోవాలని చెప్పాడు. దుబాయి పోలీసులు జైలులో వేస్తారని బెదింరించాడు. చేసేదేమిలేక అందరూ వచ్చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. దుబాయ్ బ్యాంకు అధికారులు ఫోన్‌ చేసి ‘ఈఎంఐలు చెల్లించండి’ అంటూ అడగటంతో బాధితులు కంగుతిన్నారు. నిందితుడికి ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాము మోసపోయామని ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్యలను కలిసి ప్రజావాణిలో కంప్లైట్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: కూటమికి కటీఫ్.. TTD చైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందే: పవన్ సంచలనం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...

తెలంగాణ ఆర్టీసీకార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం సమ్మెవిరమణకు ప్రయత్నించినప్పటి వారు సమ్మెకు వెళ్లడానికే సిద్ధపడుతున్నారు. దీంతో కార్మికులకు ప్రభుత్వం లేఖ రాసింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంది.

New Update
TGSRTC NEWS

TGSRTC

TGSRTC: తెలంగాణ ఆర్టీసీకార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఇప్పటికే ప్రభుత్వం సమ్మె విరమణకు ప్రయత్నించినప్పటి వారు సమ్మెకు వెళ్లడానికే సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో కార్మికులకు ప్రభుత్వం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖలో సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొంది.

Also read : TGSRTC : బస్సు భవన్‌‌ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..

క్షేత్రస్థాయిలో మీరు సమర్థంగా విధులు నిర్వర్తించడం వల్లే టీజీఎస్‌ఆర్టీసీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏ మాత్రం రాజీపడట్లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను అందించింది. ఆర్పీఎస్‌-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లు చెల్లించింది. గత మూడున్నరేళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు ఇస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి గురించి సిబ్బందికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తోన్న సంస్థకు, ఉద్యోగులకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుంది. అది సమస్యలకు పరిష్కారం కాదు. 2019లో జరిగిన సమ్మె, కొవిడ్‌ వల్ల ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మీ సమష్టి కృషి వల్ల అన్ని సంక్షోభాలను ఎదుర్కొని ప్రజల మన్ననలు చూరగొంటున్న ఈ సమయంలో సమ్మె చేయడం శ్రేయస్కరం కాదు. 

ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. ఈ అంశం గురించి సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తల్లిలాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతోపాటు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం మరిచిపోవద్దు. ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తూ.. సంస్థ మేలు కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగిపై ఉంది.  అని లేఖలో పేర్కొంది.

ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’అని ఆర్టీసీ యాజమాన్యం తమ లేఖలో పేర్కొంది.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment