ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణకు చెందిన పలువురు మహిళలు కుంభామేళాలో తప్పిపోయిన సంగతి తెలిసిందే. వీళ్లలో నలుగురు మహిళల ఫొటోలు బయటికొచ్చాయి. ఈ నలుగురు మహిళలు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం కలకలం రేపుతోంది. తప్పిపోయినవారిలో జగిత్యాల జిల్లాలోని విద్యానగర్‌కు చెందిన నరసవ్వ(55), కొత్తవాడకు చెందిన రాజవ్వ(55) కాగా మరో ఇద్దరు నిర్మల్ జిల్లాలోని కడెంకు చెందిన బుచ్చవ్వ(65), సత్తవ్వ(55)గా పోలీసులు గుర్తించారు.
Also Read: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగలడంతో..!
వీళ్ల ఆచూకి ఇంతవరకు తెలియలేదు. తప్పిపోయినవారిలో వీళ్లతో పాటు మరికొంత మంది కూడా ఉన్నారు. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా తెలంగాణకు చెందిన 11 మంది మహిళలు కుంభమేళాకు చేరుకున్నారు. ఆరోజున తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఈ మహిళలు తప్పిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారి ఆచూకిని ఎలాగైన కనిపెట్టి ఇంటికి రప్పించాలని పోలీసులను కోరుతున్నారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
ఇదిలా ఉండగా.. కుంభమేళాలో మౌని అమవాస్య రోజున జరిగిన తొక్కిసలాట జరిగిన ఘటన దుమారం రేపింది. ఈ విషాద ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. బుధవారం అర్ధరాత్రి 1:00 నుంచి 2:00 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్న మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. అమృత స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా పోటెత్తడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు.