/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
Formula E-race: కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఫార్ములా ఈ రేసు కేసు కీలక దశకు చేరుకుంది. కేటీఆర్‌ను మరోసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ వారంలోనే సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, రిటైర్డ్ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించనున్నారు.
నలుగురి స్టేట్‌మెంట్ల ప్రకారం..
అయితే ఈ ముగ్గురిని ఈ వారం రోజుల వ్యవధిలోనే విచారించనున్నట్లు సమాచారం. HMDA నిధుల దుర్వినియోగంపై జనవరి 8న సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, 9న కేటీఆర్,10న హెచ్‌ఎండీఏ బోర్డ్ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని జనవరి నెల18న గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్ ను విచారించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురి స్టేట్‌మెంట్ల ప్రకారం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను సేకరించారు.
కేటీఆర్ ప్రధాన సూత్రధారి..
ఇక తాజాగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను శుక్రవారం వర్చువల్‌గా ప్రశ్నించగా ఎఫ్‌ఈవో సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా విచారించారు. ఈ సందర్భంగా అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏస్ నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులంతా కేటీఆర్ ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపుల డాక్యుమెంట్లను సేకరించినట్లు ఏసీబీ తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ముగ్గురిని మరోసారి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, హెచ్‌ఎండీఏ బోర్డు రికార్డుల ఆధారంగా ఏసీబీ సమాచారం సేకరిస్తోంది.
Also Read: Ukraine: మా ఆవేదనను వినండి-జెలెన్ స్కీ
ఇక ఈ కేసులో ఐఏఎస్ అర్వింద్‌కుమార్ అందించిన వివరాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ వ్యవహారంలో తన పర్సనల్ ప్రయోజనం ఏమీలేదని, అంతా కేటీఆర్ చెప్పినట్లే చేశానని అర్వింద్‌కుమార్ ఏసీబీ ముందు ఓపెన్ అయ్యాడు. 2022 అక్టోబర్ 25న ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్‌ల మధ్య జరిగిన ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే 2023 అక్టోబర్ 10న ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో మధ్య జరిగిన అగ్రిమెంట్ల వివరాలు, ఫ్రూప్స్ ఏసీబీకి అందించడం సంచలనం రేపింది.