KTR: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. ఇంటికి వెళ్లిన ఏసీబీ!

కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. జనవరి 9న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని, ఈసారి కూడా లీగల్‌ టీమ్‌ను అనుమతించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. 

New Update
ACB rides

ACB rides Photograph: (ACB rides )

KTR: కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. జనవరి 9న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని, ఈసారి కూడా లీగల్‌ టీమ్‌ను అనుమతించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. 

సోమవారం తిరిగొచ్చిన కేటీఆర్.. 

ఈ మేరకు ఫార్ములా ఈ-రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ పై ఇటీవలే ఏసీబీ అధికారుల నోటీసులు జారీ చేశారు. దీంతో సోమవారం విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్ తన లాయర్లను లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వచ్చేశారు. ఇక మరోవైపు ఈ- కార్ రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల  రూపంలో కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. గ్రీన్ కో అనుబంధ సంస్థనుంచి 41 సార్లు బాండ్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు. కోటి రూపాయల చొప్పున 41 కోట్లు బాండ్ల రూపంలో చెల్లింపులు జరిగినట్లు ఆరోపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: GOOD NEWS: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు!

 ఇక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఆ డ్రామా నడుస్తోందన్నారు. తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు భయమెందుకని, తమ లాయర్లే లేకపోతే తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా లీకులిస్తారని అన్నారు. పోలీసులపై నాకు నమ్మకం లేదు. అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుతించాలని ఏసీబీ అధికారులను కోరినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Divi: ఉఫ్.. వైట్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న దివి హాట్ ఫోజులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు