Local Bodie Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

రాష్ట్రం లో పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపించడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే. బీసీ రిజర్వేషన్ తేలితేగానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు

New Update
Local Bodie Elections

Local Bodie Elections

రాష్ట్రం లో పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పుడప్పుడే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు రాష్ట్రం లో సమగ్ర కుల సర్వేకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే 2024 ఫిబ్రవరిలో కులగణనకు శ్రీకారం చుట్టింది. ఏడాది కాల వ్యవధితో ఈ సర్వే చేపట్టగా మరో రెండు రోజుల్లో సర్వేకు సంబంధించిన ముసాయిదా ప్రభుత్వానికి చేరనుంది. అనంతరం పూర్తి నివేదికను క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి అందజేస్తారు. దానిపై సబ్‌ కమిటీ  పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మంత్రి వర్గానికి అందజేయాలి. అప్పుడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి బీసీల రిజర్వేషన్లపె తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. దీనిపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తరువాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. 

Also Read: ఎలా పడతార్రా బాబు.. పులి మూత్రం బాటిల్ రూ.600- కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అయితే బీసీ కులగణన చేయాలని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం తెలంగాణ (Telangana) లో మాత్రమే 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేందుకు కేంద్రం అంగీకరిస్తుందా? లేదా అనేది సస్సెన్స్‌. మరోవైపు అన్నిరకాల రిజర్వేషన్లు కలిపి 50శాతానికి మించకూడదన్నది సుప్రీం తీర్పు. కేవలం బీసీలకే 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలంటే రాజ్యంగ సవరణ అవసరం. అది సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకం.

Also Read :  టెన్త్ విద్యార్థులకు రేవంత్ సర్కార్‌ గుడ్ న్యూస్

Local Bodie Elections In Telangana

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాను అనుచరించి 27 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి. ఇక బీసీలకు ప్రస్తుతం 23 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ సర్వే అనంతరం అదే నిర్ణయం తీసుకుంటే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. ఆ సమయంలో ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లు తగ్గిస్తారా? అంటే అది సాధ్యం కాదు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడానికి అవకాశం ఉంది. ఒకవేళ రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం అనుమతించకపోతే ఏం చేస్తందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.  స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ దాన్ని ఆచరణలో పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనపడే అవకాశం ఉంది. గత రిజర్వేషన్‌ ఆధారంగా నోటిఫికేషన్‌ ఇచ్చినా ప్రభుత్వానికి కష్టాలు తప్పకపోవచ్చు.

Also Read :  పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!
 
నిజానికి బీసీ రిజర్వేషన్‌ అమలు చేసే అంశంలో  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నప్పటికీ దాని అమలు అంతా సులభం కాదన్నది అందరి అభిప్రాయం. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతోపాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వ వాదన. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్దిని చాటుకుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి 2 లోగా క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి తుది నివేదికను అందజేయాలని అధికారులు అందజేస్తారన్న నమ్మకంలో ప్రభుత్వం ఉంది. అనుకున్నట్లు నివేదికను అందించిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంది. అయితే కేంద్రం 42 శాతం రిజర్వేషన్‌కు అంగీకరించని పక్షంలో ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తుందా? లేక మరేదైనా ప్రత్యామ్నాయం దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అనేది త్వరలోనే తేలనుంది.

Also Read :  భార్యపై అనుమానం..తనను చంపుతారేమోనని ఏం చేశాడంటే....

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు