/rtv/media/media_files/2025/03/24/Hykok2kv4qzuZIEoqnit.jpg)
Telangana High Court
RTV: బిగ్ బ్రేకింగ్ న్యూస్ : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో హైకోర్టుల కీలక ఆదేశాలు జారీ చేసింది. HCUలో చెట్లు నరకడం ఆపండి అంటూ ఆదేశించింది. రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గాని అక్కడ చేయొద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read : 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం తమదేనంటూ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ వివాదాన్ని మరింత తీవ్ర అయింది. అయితే ఈ భూమిలో అనేక వన్యప్రాణులు, విలువైన వృక్ష సంపద ఉందని, ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలని వాటా ఫౌండేషన్ (WATA Foundation) హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏప్రిల్ 3 (గురువారం) వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.
Also Read : ముంబైకి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పేసిన ఓపెనర్ బ్యాట్స్‌మెన్!
High Court Big Shock To Revanth Government
ఆ స్థలం జింకలు, నెమళ్లకు అవాసంగా ఉందని, ఆ భూములలో ప్రభుత్వం చేపడుతున్న భుముల వేలం నిలిపివేసి దానిని జాతీయ పార్కుగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కోన్నారు. కాగా ఈ పిల్ పై బుధవారం హైకోర్ట్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. అది ప్రభుత్వ భూమి అయినా సరే సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పని చేయాలని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూమిని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని అన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) తరఫున ఎల్. రవిశంకర్ వాదనలు వినిపించారు. ‘‘గత ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ(TGIIC)కి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది. కంచ గచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి, భూమిని చదును చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి.
వన్య ప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలి. నెల రోజుల పాటు అధ్యయనం చేయాలి. అక్కడ మూడు లేక్‌లు ఉన్నాయి. రాక్స్ ఉన్నాయి. ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి’’ అని కోర్టుకు తెలిపారు.
Also Read : వేసవిలో హెల్మెట్ ధరించడం చికాకుగా ఉంటుందా..ఇలా చేయండి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఈ భూములను వినియోగించలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఆ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదు. దీనికి ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్‌లున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయి. పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదు’’ అని ఏజీ వాదనలు వినిపించారు.
ఇప్పటివరకు ఈ భూమి అటవీ భూమి అని ఒక్క వాదన కూడా లేదు. కంచ గచ్చిబౌలి భూములు.. అటవీ భూములని ప్రభుత్వం సైతం ఎక్కడా నోటిఫై చేయలేదన్నారు. ఇది పూర్తిగా పరిశ్రమలు, ఇతర అవసరాలకు కేటాయించిన స్థలం మాత్రమేనని.. అటవీ భూమి కానే కాదన్నారు. నిజాం కాలం నుంచి ఈ భూమి.. బీడు భూమిగానే ఉందని కోర్టుకు తెలిపారు. అయితే, ఈ 400 ఎకరాలు పరిశ్రమల భూమి అని రికార్డుల్లో ఎక్కడైనా ఉందా? అని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. సర్వే నెంబర్ 25లో ఉన్న ఈ భూములను పలు అవసరాలకు కేటాయిస్తూ వచ్చారని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రేపటి వరకు ఆ భూముల్లో పనులు ఆపాలని ఆదేశిస్తూ.. పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై రేపటిలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని కోర్ట్ ఆదేసిస్తూ.. విచారణ రేపటికి వాయిదా వేసింది. అదే విధంగా రేపటి వరకు ఆ భూముల్లో చెట్లను కొట్టివేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : వేసవిలో బూట్లు ధరించేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
telangana-high-court | hcu campus lands | hcu campus land issue | hcu campus land auction | hcu 400 acres issue | hcu campus | latest telangana news | telangana-news-updates | telangana news today | latest-telugu-news | today-news-in-telugu
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్
తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
Bandi Sanjay Vs KCR
తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ కు, మంత్రులకు అసలు పాలనపై పట్టులేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి పనికి కమిషన్లు, అవినీతి నడుస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక కామెంట్స్
ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. దేశద్రోహులు, దేశభక్తుల మధ్య హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎంఐఎం గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని అన్నారు. మజ్లిస్ కంబధ హస్తల నుంచి హైదరాబాద్ ను కాపాడుతామని తెలిపారు సంజయ్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని.. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కేసుల నుంచి కాపాడుతుందని ఆరోపించారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
Roller Coaster Accident : మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!
Krishna River : పండుగ పూట విషాదం...కృష్ణానదిలో ఈతకు వెళ్లి..
Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్
Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్
Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్ లల్లాకు సూర్య తిలకం