/rtv/media/media_files/2025/03/25/UZPbtMsHNJCZ8wuZpVhQ.jpg)
Indigo Flight
సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తాజాగా జరిగిన ఘటనతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఈ నెలలో రెండోసారి వార్తల్లో నిలిచింది.
Also Read: కాంగ్రెస్ అధిష్ఠానంపై అలిగిన మంత్రి ఉత్తమ్.. ఎందుకంటే ?
మార్చి 17న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యల వల్ల విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!
విమానం గాల్లో ఉన్నప్పుడు పైలట్ టెక్నికల్ సమస్యను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై శంషాబాద్ ఏటీసీకి సమాచారం అందించారు. ఎమర్జేన్సీ ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో అప్పుడు విమానంలో 737 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించడం కలకలం రేపింది.
Also Read: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్
Also Read: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!
rtv-news | telugu-news | airport | shamshabad | shamshabad-airport