/rtv/media/media_files/2025/03/27/tQCrJ6vCjUPWZAyTZDmm.jpg)
jaggareddy-cinema
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగాది పండగ రోజున ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఆఫీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఆయన సినిమా ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. ఉగాది పండుగ రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్ అనే సినిమాను ఆయన స్వయంగా నిర్మించడమే కాకుండా అందులో ఆయన ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు. వచ్చే ఏడాది ఉగాదికి సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇంటర్వెల్ కు ముందు సినిమాల్లో జగ్గారెడ్డి పాత్ర ఎంట్రీ ఉంటుందని.. సినిమా పూర్తయ్యేవరకూ ఆయన పాత్ర కొనసాగనుందని తెలుస్తోంది.
Also read : పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!
ఎ వార్ ఆఫ్ లవ్.. జగ్గారెడ్డి
— Natanam (@NatanamNZ) March 10, 2025
పాన్ ఇండియా సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ MLA జగ్గారెడ్డి.
ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్న జగ్గారెడ్డి.#jaggareddy #Congress #Telangana #Movies #waroflove pic.twitter.com/qiCNCUBYOI
Also Read : రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి స్వీట్ కామెంట్.. ఏమన్నారంటే?
సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్‌కు భారీ స్పందన రావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. అయితే ఈ సినిమాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు జగ్గారెడ్డి. తాను విద్యార్థి నేత నుంచి కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా ఎలా ఎదిగానన్నదీ.. ఈ సినిమాలో అక్కడక్కడ చూపించనున్నట్లు తెలిపారు. ఇందులో లవ్, ఫ్యాక్షన్, ఎమోషనల్, పొలిటికల్ డ్రామాగా మూవీ ఉంటుందన్నారు. సినిమా సంబంధించిన నటీనటుల గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Also Read : షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు
Also Read : SRH vs LSG : ఉప్పల్లో హై ఓల్టేజ్ మ్యాచ్..సన్‌రైజర్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్!
jagga reddy a war of love | ex-mla-jaggareddy | latest telangana news | telangana news today | telangana-news-update | today-news-in-telugu