EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే సంజయ్ చేరడాన్ని మెుదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి నిన్న(ఆదివారం) ఆయనపై విమర్శలు గుప్పించారు.పదేళ్లపాటు బీఆర్ఎస్ హయాంలో అధికారం చెలాయించి, ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకే కాంగ్రెస్‌లో చేరారంటూ సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా స్పందించారు. తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానంటే జీవన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటో అర్థం కావడం లేదని కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డికి ఎందుకంత అసహనమో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా
కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఓ న్యాయం.. మిగతా వారందరికీ మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పలేదా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన వెంట తిరిగి అనుకూలంగా పని చేసిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, డీసీసీ ఛైర్మన్లు సహా చాలా మందిని కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి చేర్చుకున్నారంటూ ఆరోపించారు.తాను చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లు చేస్తే తప్పన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇవే చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్పారని, మరి మీ స్థానంలో కొత్త నాయకత్వం రావొద్దా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి నీతులు చెప్పాలని అనుకోవడం లేదని, ఆయన హుందాగా నడుచుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చురకలు అంటించారు.
ఇది కూడా చదవండి: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
పేదలకు లబ్ది చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. ప్రజల్లో సన్న బియ్యంపై ఉన్న అపోహలను తొగించేందుకు ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలోని ఓ రేషన్ కార్డు లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్ కుమార్.. సోమవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి
Also Read : Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)