Telangana: కేసీఆర్ వల్లే SLBC టన్నెల్‌ కూలింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో SLBC పనులు ఆగిపోయాయనీ సీఎం రేవంత్ అన్నారు.అందువల్లే టన్నెల్‌ కుప్పకూలిందని ఆరోపించారు. సొరంగంలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

author-image
By B Aravind
New Update
KCR and CM Revanth

KCR and CM Revanth

సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో SLBC పనులు ఆగిపోవడం వల్లే టన్నెల్‌ కుప్పకూలిందని ఆరోపించారు. సొరంగంలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 'ప్రజాపాలన-ప్రగతి బాట' బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' కేసీఆర్‌ పదేళ్ల పాటు తెలంగాణకు సీఎంగా ఉన్నారు. మోదీ 12 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు.    
తెలంగాణకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏం చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా ? లేదా? చెప్పాలని రైతులను కోరుతున్నా. బీజేపీ, బీఆర్ఎస్‌ నాయకులు చేసే తప్పుడు ప్రచారాన్ని రైతులు తిప్పికొట్టాలి. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ కూడా కోతలు విధించామా ?రూ.200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామా ? లేదా?. మహాలక్ష్మీ స్కీమ్‌ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.  65 లక్షల మంది మహిళలు ఇప్పుడు స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఖ్యను కోటికి పెంచి.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేసేందుకు కృషి చేస్తున్నాం.  
కోటి మంది ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయాలని కృషి చేస్తున్నాం. కృష్ణా జలాలను ఏపీ సర్కార్ రాయలసీమకు తీసుకెళ్తున్నారంటే దానికి కారణం కేసీఆర్. 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 511 టీఎంసీలు ఇవ్వడంపై కేసీఆర్‌ సంతకం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో SLBC పనులు ఆగిపోయాయి. అందుకే టన్నెల్‌ కుప్పకూలింది. అందులో చిక్కుకొని 8 మంది ప్రాణాలు కోల్పోవడానికే కేసీఆరే కారణమని'' రేవంత్ అన్నారు. 
అలాగే మామునూరు ఎయిర్ పోర్టు ప్రధాని మోదీ ఇచ్చారని, నేనే తెచ్చానంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారంటూ విమర్శించారు. అదే జరిగితే మెట్రో ఎందుకు రాలేదని , ఆపింది మోదీనే కదా అంటూ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కిషన్‌ రెడ్డి సైంధవుడిలా మారారంటూ విమర్శించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు