SLBC Tunnel: టన్నెల్ వద్ద సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నారు.

New Update
CM Revanth Reddy Tunnel

CM Revanth Reddy Tunnel Photograph: (CM Revanth Reddy Tunnel)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన ముగించుకుని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకున్నారు. జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా టన్నెల్ వద్దకు వెళ్లారు. 

ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

జీపీఆర్ మార్కింగ్ చేసి..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. వరుసగా తొమ్మిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్‌ను వద్దకు వెళ్లారు. అయితే టన్నెల్‌లో ఉన్నవారంతా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. టన్నెల్‌ లోపల జీపీఆర్‌ మార్కింగ్‌ చేసి నాలుగు మృత దేహాలను గుర్తించారు. వాటిని తీసి సొంత గ్రామాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన నాలుగు మృత దేహాలు తీయడం కష్టమని ఎన్టీఆర్ బృందాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Sandeep Reddy Vanga: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
cm revanth tg

Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home

TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment