/rtv/media/media_files/2025/02/26/cbkf2VdNK8AThnxm45Cm.jpg)
CM Revanth Meets PM Modi
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SLBC టన్నెల్ సహాయక చర్యల గురించి ప్రధానికి సీఎం వివరించారు. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల జాబితాను కూడా ప్రధానికి అందించారు. ముఖ్యంగా 5 అంశాలంపై రేవంత్ వినతులు సమర్పించారు. మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీకి సాయం చేయాలన్నారు. అలాగే ఐఏఎస్ కేడర్లను పెంచాలని కోరారు.
Also Read: డీలిమిటేషన్ అలా చేస్తేనే మంచిది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హెదరాబాద్ మెట్రో ఫేస్-2 కోసం రూ.22 వేల కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. రీజనల్ రింగ్ రోడ్డులో దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలన్నారు. డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరారు. మూసీ సుందరీకరణ కోసం నిధులు కేటాయించాలన్నారు. గుజరాత్ సబర్మతి ప్రాజెక్టు లాగే మూసి ప్రాజెక్టు ఉంటుదని తెలిపారు. గోదావరి నదిని మూసితో అనుసంధానించి స్వచ్ఛమైన జలాలను అందించాలని కోరారు. అలాగే తెలంగాణలో 27 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయాలని, వరద నివారణ కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, కరకట్టల బలోపేతం కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ విభజన చట్టం-2014లోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Had a meeting with Prime Minister
— Revanth Reddy (@revanth_anumula) February 26, 2025
Shri @narendramodi Ji today in Delhi.
We discussed various significant developmental projects & welfare schemes that we are rolling out in #Telangana.
Sought his fullest support for our #TelanganaRising vision & cooperation for our state, so we… pic.twitter.com/SNR3l33l4H
Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం
ప్రధానితో సమావేశం అనంతరం సీఎం రేవంత్ మీడియా మాట్లాడారు. '' ప్రధాని మోదీకి చేయాల్సిన విజ్ఞప్తులు చేశాం. కేంద్రం నుంచి సాయం అందేలా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలి. ఇంతకాలం రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. ఇప్పుడు నిధులు సాధించుకుని వస్తే ఆయన కోసం బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తాం. ప్రధానమంత్రి కూడా నాకు ఓ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐదు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం తరఫున విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చారని'' సీఎం రేవంత్ అన్నారు.