/rtv/media/media_files/XNZTPOQBXQrchCe2AM6G.jpg)
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గతంలో ఇది వరకే ఈ ఆర్థిక, సామాజిక కులగణన చేయగా.. అందులో పాల్గొనని వారికోసం మరోసారి కులగణన చేపట్టనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వే చేయనున్నారు. గతంలో కులగణనలో పాల్గొనని 3.1 శాతం వారు సద్వినియోగం చేసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి కోరారు. దీని కోసం టోల్ ఫ్రీ నెం. 040-211 11111ను ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?
కులగణన సర్వేలో 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదని అధికారులు వెల్లడించారు. కులగణన లెక్కలు తేలాకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం చర్చించనుంది తెలంగాణ సర్కార్. కుల గణనలో బీసీ జనాభా 10 శాతం ఎలా తగ్గిందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. సర్వే సరిగా చేయాలేదని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మె్ల్యేలు అసెంబ్లీలో విమర్శించారు. దీంతో కులగణన వివరాల నమోదుకు మరో అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!