Megha Engineering: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్‌ నేతల డిమాండ్

రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మెఘా కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐ సంస్థలు కూడా మెఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. మెఘాతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు బోగస్ అని అన్నారు.

New Update

మెఘా కంపెనీపై బీఆర్ఎస్‌ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మెఘా కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐ సంస్థలు కూడా మెఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభ ప్రద్ పటేల్, తదితర బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఈ డిమాండ్ చేశారు.

Also Read: ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు... ఫిబ్రవరి 9 డెడ్‌లైన్

'' మెఘా కంపెనీపై ఈడీ దర్యాప్తు జరగాలి. ఇక్కడ చేసుకోవాల్సిన ఎంఓయులు దావోస్ వెళ్లి చేసుకోవాల్సిన అవసరం రేవంత్‌కి ఏముంది. దావోస్‌లో మెఘా కృష్ణారెడ్డికి  రేవంత్‌కి డీల్ కుదిరిందా ?. వికారాబాద్‌లో వెల్నెస్ సెంటర్ ఏంటి ?. రేవంత్ రెడ్డి చేసుకుంటున్న ఒప్పందాలని బోగస్. మెగా ఇంజనీరింగ్‌తో చేసుకున్న ఒప్పందాలన్నీ బోగసే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి దొంగ అన్నాడు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా కంపెనీ మంచిదయిందా. మెగా ఇంజనీరింగ్, రేవంత్ రెడ్డి మధ్య క్విడ్ ప్రోకో జరుగుతోంది. ఢిల్లీలో హైకమాండ్‌కు ముడుపులు అందించేందుకే మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ విషయంలో ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మెగా కంపెనీపై చర్యలు తీసుకోరా?. మెగా కృష్ణారెడ్డి స్కిల్ యూనివర్సిటీకి రూ.200 కోట్ల చెక్ ఇచ్చాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెఘా కంపెనీని రేవంత్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు. 

Also Read: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే

రేవంత్ కి అధికారంలోకి రాగానే మేఘా కంపెనీ గ్రేట్ ఇండియా కంపెనీ అయిందా ?. మెగా కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను, మేఘ కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో ప్రాజెక్టులు మెఘా కంపెనీకే ఇచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసింది మెఘా కంపెనీ అన్న రేవంత్, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ప్రాజెక్టులు ఎందుకు ఇస్తున్నారని'' బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మెఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు