Mallareddy : మల్లారెడ్డినా మజాకా.. అసెంబ్లీలో నవ్వులే.. నవ్వులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు.  ఆయన మాట్లాడేందుకు నిలబడగా..  మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా..  ధన్యవాదాలు అధ్యక్షా అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు.

author-image
By Krishna
New Update
mallareddy-funny

mallareddy-funny

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు.  ఆయన మాట్లాడేందుకు నిలబడగా..  మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా..  ధన్యవాదాలు అధ్యక్షా అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు. తాను రెండు విషయాలు చేప్తానని.. అందులో ఒకటి ప్రభుత్వానికి పదుకొండ వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది అన్నారు మల్లారెడ్డి.  రెండోది తన మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల, సర్పంచ్ ల బాధలన్నారు.  

Also Read :  రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి స్వీట్ కామెంట్‌.. ఏమన్నారంటే?

Also Read :  ఇలా జరిగిందేంటి.. రిలీజ్ వేళ షోలన్నీ రద్దు! చిక్కుల్లో విక్రమ్ సినిమా

మేడ్చల్ నియోజవర్గానికి దిష్టి

ఇందులో ఏదో  ఒకటి చెప్పాలని స్పీకర్ అన్నారు. దీంతో సభలో అందరూ నవ్వారు. మేడ్చల్ నియోజవర్గానికి దిష్టి తగిలినట్లుందని.. 61 గ్రామాలు పోయి అన్నీ మున్సిపాలిటీలు అయిపోయని మల్లారెడ్డి అన్నారు. మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలుండగా.. మరో మూడు మున్సిపాలిటీలు చేశారని..  దయచేసి తమకు సేమ్ రిజర్వేషన్ ఉంచాలని..  మమ్మల్ని GHMC లో కలపొద్దంటూ మంత్రి శ్రీధర్ బాబును మల్లారెడ్డి కోరారు. ఇక ప్రభుత్వానికి పదుకొండ వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదానిపై మాల్లారెడ్డి మాట్లాడుతుండగా..  స్పీకర్ మైక్ కట్ చేశారు. 

Also read :  RR vs KKR : ఏంటీ ఇదంతా PR స్టంటా..కాళ్లు మొక్కడానికి పరాగ్ పదివేలు ఇచ్చాడా?

Also Read :  Jagga Reddy : ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..!

 

telangana-assembly | brs-party | brs mla mallareddy | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana-news-updates | telangana news today

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGBIE: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అప్పటి నుంచే వేసవి సెలవులు

తెలంగాణ ఇంటర్ విద్యామండలి (TGBIE) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఅన్నిఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి30 నుంచి ప్రారంభమై జూన్ 1వరకు కొనసాగుతాయి. ఈషెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

New Update
 INTERMEDIATE EDUCATION

INTERMEDIATE EDUCATION

TGBIE : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30, 2025 నుంచి ప్రారంభమై జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.  కాలేజీలు జూన్‌ 2వ తేదీన తిరిగి పునఃప్రారంభమవనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!
 
విద్యార్థులు వేసవి సెలవులను స్వీయ అధ్యయనం, నైపుణ్యాల అభివృద్ధి, ఇతర ప్రయోజనకరమైన కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సూచించింది. జూన్ 2, 2025 నుంచి తరగతులు మళ్లీ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. అలాగే, సెలవుల సమయంలో అనధికారికంగా తరగతులను నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్‌ మహిళా మావోయిస్టు మృతి

ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, బోధన సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులు ప్రకటించారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక ఈనెల 25వ తేదీతో ఇంటర్‌ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు 2024--25 అకడమిక్ సంవత్సరానికి శనివారమే చివరి పనిదినం. అంటే ఈనెల 30 నుంచి జూన్‌ 1 తేదీ వరకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. తిరిగి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జూన్‌ 2న కళాశాలలు ప్రారంభమవుతాయి.

Also Read:  Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!

ఇంటర్‌బోర్డు నిబంధనల ప్రకారం వేసవి సెలవుల్లో ఇంటర్‌ తరగతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులు నిర్వహించకూడదు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు సమాచారం. పరీక్షల అనంతరం విద్యార్థులకు విశ్రాంతి అవసరమని.. వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. వేసవి సెలవుల సమయంలో విద్యార్థులు భద్రతా సూచనలను పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Temperature: ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో దబిడి దిబిడే.. IMD వార్నింగ్

Advertisment
Advertisment
Advertisment