/rtv/media/media_files/2025/07/18/bomb-threats-2025-07-18-11-41-21.jpg)
Bombs in three places in Telugu states
తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం(rajamundry), కరీంనగర్ జిల్లా(karimnagar) కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్(Bomb Threat Mails) రావడంతో అంతా అప్రమత్తమయ్యారు.
Also Read : తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్.. ఎప్పుడంటే?
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) February 18, 2026
కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపులు
12.05 నిమిషాలకు పేలుతాయంటూ అన్‌నౌన్ మెయిల్
12 చోట్ల ఆర్డీఎక్స్ పెట్టామంటూ బెదిరింపులు
డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన పోలీసులు pic.twitter.com/QfEnPv0you
నాంపల్లి సీబీఐ కోర్టు(nampally-court) లో బాంబు(Bomb threat latest) పెట్టామంటూ బుధవారం ఒక మెయిల్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబు(Bomb Threat Call to Hyderabad) ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఈ వార్త ఒక్కసారిగా వ్యాపించడంతో కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కోర్టు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తనిఖీలు ముమ్మరం చేశారు. కాగా కోర్టు లోపల ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు పంపి, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. ప్రతి గదిని, కోర్టు మూల మూలలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఆకతాయిల పనినా? లేక నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా? అన్నది తనిఖీలు ముగిస్తే తప్ప చెప్పలేమని అధికారులు తెలిపారు.
కరీంనగర్ కోర్టుకు...
అలాగే కరీంనగర్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు(Bomb Threat News) వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కోర్టులో బాంబులు పెట్టామని మధ్యహ్నాం 12.05 నిమిషాలకు పేలుతాయంటూ అన్‌నౌన్ మెయిల్ రావడం కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో 12 చోట్ల ఆర్డీఎక్స్ పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ అనుమానస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
Follow Us