సామాన్లు సర్థుకో KTR.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు : ఎమ్మెల్యే రాజాసింగ్

కేటీఆర్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదలదు KTRను ట్యాగ్ చేశాడు. జైలుకు వెళ్లేటప్పుడు 4 జతల బట్టలు, కర్చిఫ్, దుప్పట, పచ్చడి, సబ్బు, వింటర్ కాబట్టి స్వెటర్ కూడా తీసుకెళ్లాలని కేటీఆర్‌కు రాజాసింగ్ సూచించాడు.

author-image
By K Mohan
New Update
Raja singh Murder sketch

ఈ ఫార్ములా రేసు నిర్వహణలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేటీఆర్ అరెస్ట్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. అందులో కర్మ ఎవరిని వదిలి పెట్టదని రాసుకొచ్చారు. నా మీద కేసు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జైలుకు పంపాయని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. ఆ గేమ్ ఇప్పుడు ప్రారంభమైందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్ చేశారు.  జైలుకు వెళ్లేముందు కొన్ని వస్తువులు తీసుకెళ్లండని ఆయన కేటీఆర్‌కు సూచించారు.

నాలుగు జతల బట్టలు తీసుకెళ్లాలి. ఎందుకంటే జైళ్లో కూడా ఫాషన్ అవసరం. ఓ దుప్పట, టవల్, హ్యాడ్ కర్చిఫ్, సబ్సు, ఓ డబ్బా పచ్చడి జైలుకు వెళ్లేముందు ప్యాక్ చేసుకోవాలని కేటీఆర్‌‌ను ట్యాగ్ చేసి ఎక్స్‌లో రాజాసింగ్ ట్వీట్ చేశారు. కటకలాల్లో ఉన్నప్పుుడు ఎమోషన్‌కు గురై ఏడుపు కూడా వస్తుందని.. కన్నీళ్లు తూడుచుకోవడానికి కర్చిఫ్ ఉండాలని అన్నారు. జైళ్లో ఉన్నా సరే.. శుభ్రంగా ఉండాలని అందుకే ఓ శుభ్రమైన టవల్ తీసుకెళ్లాలన్నారు. జైళ్లో ఫుడ్ బాగోదు కాబట్టి.. పచ్చడి బాక్స్ పెట్టుకెళ్లమని సెటరికల్‌గా అడ్వైజ్ ఇచ్చారు. 

అలాగే ఇప్పుడుంది చలికాలం కాబట్టి ఓ వెచ్చని స్వెటర్ కూడా తీసుకెళ్లాలని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు చెప్పారు. కర్మ ఎవరినీ ఊరికే వదిలిపెట్టదు.. అది సరైన టైం కోసం ఎదురుస్తుంది అంతే అని ఆయన ట్వీట్ లో రాశారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతరులను టార్గెట్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో మీరు కూడా రుచి చూస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్‌లో రాశారు.

Read also : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ బిగ్ షాక్!

2022 ఆగస్ట్‌లో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దానికి కర్మగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారని రాజాసింగ్ ఈ ట్వీట్ చేశారు. ఓ వ‌ర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్‌కు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంది. 

Read also : లిక్కర్ స్కామ్ పార్టీని ఓడిస్తాం.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు