Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

ఉమ్మడి నల్గొండలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. పలు పౌల్ట్రీఫామ్‌‌లలో కోళ్ళు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పౌల్ట్రీఫామ్‌ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.

New Update
Australia: భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో

 సుమారు నెల రోజుల కిందట రెండు తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికించిన సంగతి తెలిసిందే. కొన్ని లక్షల కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. దీంతో చికెన్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. చికెన్ రేట్లు కూడా భారీగా తగ్గాయి. అయినా ప్రజలు వాటిని తినేందుకు ఇష్టపడలేదు. చికెన్, ఎగ్స్ తినడమే మానుకున్నారు. ఆ తర్వాత బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది. దీంతో వినియోగదారులు కూడా చికెన్ సెంటర్ల వైపు పరుగెత్తారు. చికెన్ ధరలు పెరిగినా కొనేందుకు ఆసక్తి చూపించారు.

Also Read: Ap Crime: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!

అయితే మళ్లీ మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధితో కోళ్లు చనిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓ ఫామ్‌లోని‌ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. సంబంధిత కోళ్ల ఫామ్ లో సుమారుగా రెండు లక్షల కోళ్లు ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాదు.. భూదాన్ పోచంపల్లి మండలం, దోతిగూడెంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కూడా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు తెలిపారు. 

Also Read: America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

ఇక్కడ దాదాపు 40 వేలకు పైగా కోళ్లకు ఈ వ్యాధి సోకగా.. వాటిని చంపి అధికారులు పాతిపెట్టారు. అంతేకాకుండా.. ఆ ప్రాంతం అంతా శానిటైజ్ చేశారు. ఎక్కడైతే కోళ్ల ఫామ్స్ ఉంటాయో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. సమీప గ్రామ ప్రజలను కూడా అటువైపు రావద్దంటూ అధికారులు సూచించారు.ఈ నెల12వ తేదీన దోతి గ్రామంలోని పిట్ట సుదర్శన్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌లో 500 కోళ్లు మృతి చెందాయి. ఆ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పశువైద్యాధికారులు చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. వాటిని మధ్యప్రదేశ్, భోపాల్‌లోని హై సెక్యూరిటీ వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ వీటిని పరీక్షించగా..వాటికి బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ అయింది.

దీంతో శుక్రవారం పశువైద్య అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఆ పౌల్ట్రీఫామ్‌ను సందర్శించారు. అక్కడ అధికారులు పీపీఈ కిట్లు ధరించి.. 40 వేల కోళ్లను చంపి... వాటిని అక్కడే చుట్టు పక్కల ప్రాంతంలో గోతి తీసి పూడ్చిపెట్టారు. వాటితో పాటు దాదాపు 19 వేల కోడిగుడ్లను సైతం పూడ్చి పెట్టారు. అంతే కాకుండా.. ఇదే ఫాంలోని కోళ్ల పెంటను కూడ దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. మూడు నెలల వరకు ఈ పౌల్ట్రీఫామ్‌ను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Also Read: Mallareddy: పార్టీ మార్పుపై నా ఆలోచన ఇదే.. సీఎం రేవంత్ తో భేటీపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Also Read: MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ‘ఆయన రబ్బర్ స్టాంపే’

 

telangana | nalgonda | bird-flue | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని సలేశ్వరం జాతన మొదలైంది. దీనికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో శ్రీశైలం హైవే వాహనాలతో నిండిపోయింది. అక్కడ ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 

New Update
TS

Srisailam High way

 

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే సలేశ్వరం బాగా ఫేమస్. ఇక్కడ శివుడిని దర్శించుకోవడానికి భక్తులు విపరీతంగా వస్తారు. ఏడాది ఒకసారి చేసే జాతరకు విశిష్టత ఉండండతో ఈ సమయంలో భక్తులు పోటెత్తుతారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడు కూడా సలేశ్వర్ జాతరకు జనాలు వేలల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్‌  చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ ను వాలంటీర్లు, అటవీశాఖ కంట్రోల్ చేస్తోంది. 

లింగమయ్య స్వామి జాతర..

ప్రతీ యేడూ చైత్ర పోర్ణమి సందర్భంగా సలేశ్వరంలో మూడు రోజుల పాటూ లింగమయ్య స్వామి జాతర జరుగుతుంది. దీనికోసం భక్తులు చాలా దూరం కాలి నడకన వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా కష్టమైన మార్గంలో. అయినా కూడా భక్తులు ఎంతో శ్రద్ధగా, నిష్టగా ఇక్కడకు వెళుతుంటారు. ప్రస్తుతం ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 today-latest-news-in-telugu | srisailam | high-way | trafficjam

Also Read: Supreme Court: రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment