/rtv/media/media_files/2025/02/19/zm5I6SyHw8Xe9rYiM2DU.jpg)
Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry
గత కొద్ది రోజులుగా తెలంగాణ (Telangana) లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రోజుకు కొన్ని వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా ఒకేసారి 4వేల కోళ్లు మృతి చెందడం సంచలనంగా మారింది. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శివకేశవ రెడ్డి అనే రైతుకు ఒక కోళ్లఫామ్ ఉంది. దానిని దాదాపు 5,550 కోళ్ల కెపాసిటీతో నిర్మించాడు.
4000 కోళ్లు మృతి
అందులో తాజాగా 4000 కోళ్లు మృతి చెందాయి. అయితే ఒకేసారి ఇన్ని కోళ్లు మృతి చెందడానికి పూర్తి కారణాలు తెలియకపోయినా.. బర్డ్ ఫ్లూ (Bird Flu) కారణంగా ఇలా జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగానే ఇవాళ ఉదయం రైతు శివకేశవ రెడ్డి తన కోళ్ల ఫామ్‌కు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఫామ్‌లో వేల సంఖ్యలో చనిపోయి ఉన్న కోళ్లను చూసి చలించిపోయాడు.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
కంపెనీకి సమాచారం
నిన్నటి నుంచి కోళ్లు మృత్యువాత పడటాన్ని శివకేశవ రెడ్డి గమనించాడు. దీంతో వెంటనే తాను ఏ కంపెనీ నుంచి అయితే కోళ్లను తీసుకువస్తున్నాడో.. ఆ కంపెనీకి సమాచారం అందించాడు. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆ కంపెనీ శివకేశవ రెడ్డికి సూచించింది. ఇక బర్డ్ ఫ్లూగా అనుమానించిన అతడు చనిపోయిన 500 కోళ్లను బయట గొయ్యి తీసి పూడ్చేశాడు.
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
అధికారులు పట్టించుకోలేదు
ఇక వరుసగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. అలా మొత్తంగా 4000 వేల కోళ్లు చనిపోయాయి. ఇక చేసేదేమిలేక వాటిని కూడా గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. అనంతరం వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంపై అతడు వెటర్నరీ అధికారులకు సమాచారం అందించాడు. కానీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని అతడు ఆందోళనకు దిగాడు. ఇన్ని కోళ్లు చనిపోవడానికి గల కారణం ఏంటో చెప్పాలని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. దీనిపై అధికారులు నిర్ధారణ చేయాల్సిందేనని అతడు డిమాండ్ చేస్తున్నాడు. తీవ్రంగా నష్టపోయానని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.