/rtv/media/media_files/2025/04/03/vRspZXmktu7Hu9nmztnJ.jpg)
KCR
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. 2011లో నమోదైన రైల్‌రోకో కేసును న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో రైల్‌రోకో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసీఆర్‌ను 13వ నిందితుడిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: మంత్రి పదవి ఊస్ట్?.. సోనియా, ఖర్గేతో కొండా సురేఖ కీలక భేటీ!
ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు కోర్టులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నందున కేసును కొట్టివేయాలని కేసీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైల్‌రోకో జరిగినప్పుడు కేసీఆర్ ఘటనాస్థలంలో లేరని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Also Read: చెన్నైలో త్వరలో కార్ల్‌మార్క్స్ విగ్రహం.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన
మరోవైపు కేసీఆర్ పిలుపుతోనే రైల్‌రోకో నిర్వహించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమవైపు వాదనలు వినిపించారు. చివరికీ ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కేసీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు విషయంలో కేసీఆర్‌కు పెద్ద ఊరట లభించినట్లయ్యింది.
Also read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
Also Read: వారంలో 36 గంటలు శృంగార సెలవు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
kcr | rtv-news | high-court