/rtv/media/media_files/2025/02/08/fDIONlIeir3E0nSYAMhR.jpg)
Kazipet Junction railway station
కాజీపేట, వరంగల్ రూట్లలో రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా. అయితే ఇది మీ కోసమే. ఈ రూట్లలో ఈ నెల 10 నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-విజయవాడ మధ్య ఇంటర్ లాకింగ్ వర్క్ బ్లాక్ కారణంగా ఈ నెల 10 నుంచి కాజీపేట జంక్షన్ నుంచి వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Delhi CM: ఢిల్లీ సీఎం ఎవరు ?.. రేసులో ఉంది వీళ్లే
Trains Cancelled From Kazipet - Warangal Routes
రాష్ట్రంలోని రద్దీగా ఉంటే స్టేషన్లలో కాజీపేట (Kazipet), వరంగల్ (Warangal) కూడా ముఖ్యమైనవి. ఈ రూట్లలో ప్రతి రోజు వందలాది ట్రైన్స్ నడుస్తుంటాయి. అయితే ఈ రూట్లలో ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ నెల 10 నుంచి ఈ రెండు స్టేషన్లనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్యాసింజర్లకు రైల్వేశాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 10 నుంచి కాజీపేట, వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాజీపేట-విజయవాడ మధ్య ఇంటర్ లాకింగ్ వర్క్ బ్లాక్ కారణంగా ఈనెల 10 నుంచి కాజీపేట జంక్షన్ నుంచి వెళ్లే పుష్ ఫుల్ ప్యాసింజర్లు, వరంగల్ కాజీపేట మీదుగా నడిచే ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మల్లించినట్లు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాజీపేట-డోర్నకల్ (67765) పుష్ ఫుల్, డోర్నకల్-కాజీపేట (67766) పుష్ ఫుల్, దోర్నకల్-విజయవాడ (67767)పుష్ ఫుల్, విజయవాడ-భద్రాచలం (67215) సింగరేణి ప్యాసింజర్, భద్రాచలం-విజయవాడ (67216) సింగరేణి ప్యాసింజర్, గుంటూరు-సికింద్రాబాద్(17201) రైళ్లు రద్దు అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు సికింద్రాబాద్-గుంటూరు (17202) ఎక్స్ ప్రెస్, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (17234) ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 10,11,15, 18,19,20వ తేదీల్లో గుంటూరు-సికింద్రాబాద్(12705) ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు (12706) ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!
ఫిబ్రవరి 11,14,16,18,19, 20వ తేదీల్లో విజయవాడ-సికింద్రాబాద్ (12713) ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ (12714) ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం-ఎల్‌టీటీ ముంబయి(18519) ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 12 నుంచి 22వ తేదీ వరకు ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్నం(18520) ఎక్స్ ప్రెస్, ఈ నెల 18న మచిలీపట్నం-సాయి నగర్ షిరిడి(17208) ఎక్స్ ప్రెస్, 19న కాకినాడ పోర్టు-సాయినగర్ షిరిడి(17206) ఎక్స్ ప్రెస్, 20న సాయి నగర్ షిరిడి- కాకినాడ పోర్టు(17205) ఎక్స్ ప్రెస్ లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ