/rtv/media/media_files/2026/04/03/mangos-2026-04-03-17-09-25.jpg)
Adulterated mangos
CP Sajjanar : వేసవి కాలం(summer) వచ్చిందంటే చాలు పండ్లలో రారాజు మామిడి(mangos) మార్కెట్‌లో సందడి చేస్తోంది. వేసవి సీజన్ లో వచ్చే మామిడి పండ్లను తినడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. వేసవిలో మార్కెట్‌లలో కూడా మామిడి పండ్లు విరివిరిగా దొరుకుతాయి. అయితే అందంగా ఆకర్శించి నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చలగాటమాడుతున్నారు. అందుకే కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
Also Read : KCR బద్దశత్రువుకి MLA టికెట్.. తమిళనాడులో అన్నమలైకు BJP బిగ్ షాక్
Beware Of Adulterated Mango's
సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను కొంతమంది స్వార్థపరులైన వ్యాపారులు కొందరు కృత్రిమంగా మగ్గించి విక్రయాలు జరుపుతున్నారు. మామిడి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని సీపీ హెచ్చరించారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీసు విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా సహజ సిద్ధంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని ఆయన హెచ్చిరించారు. ఇలాంటి విషతుల్యమైన పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : గ్రూప్-1 నియామకాలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కాగా ఈ కల్తీని అరికట్టడానికి పోలీసు శాఖ కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని సజ్జనార్ కోరారు. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిలో మామిడి పండ్లను కడిగినప్పుడు అవి రంగు మారినా ఆ పండ్లు ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలని సూచించారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ కోరారు.
Follow Us