Harsha Sai: హలో మిస్టర్ చీటర్.. నిన్ను కర్మ వెంటాడుతోంది: హర్షసాయిపై మాజీ లవర్ షాకింగ్ పోస్ట్!

బెట్టింగ్ యాప్ కేసుల నేపథ్యంలో యూట్యూబర్ హర్షసాయికి మాజీ లవర్ మిత్రా శర్మ బిగ్ షాక్ ఇచ్చింది. 'నిన్ను కర్మ వెంటాడుతోంది. ఎప్పటికీ తప్పించుకోలేవ్. నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. బ్యాంకాక్ నుంచి వచ్చేయ్' అంటూ హర్ష పేరు ప్రస్తావించకుండా పోస్ట్ పెట్టింది. 

New Update
harsha mitra

Mitra Sharma big shock to Harshasai

Harsha Sai: బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ కేసుల నేపథ్యంలో యూట్యూబర్ హర్షసాయికి తన మాజీ ప్రియురాలు మిత్రా శర్మ మరో బిగ్ షాక్ ఇచ్చింది.  హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హర్షసాయి పేరు ప్రస్తావించకుండా మిత్రా సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. నిన్ను కర్మ వెంటాడుతోందని, ఎప్పటికీ తప్పించుకోలేవంటూ సంచలన కామెంట్స్ చేసింది.

హలో మిస్టర్ చీటర్..

ఈ మేరకు 'హలో మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్ పారిపోయావ్ అని తెలిసింది. నీవు మమ్మల్ని మోసం చేసి మా జీవితాలు నాశనం చేసావ్. ఇప్పుడు నిన్ను కర్మ వెంటాడుతోంది. ఇప్పటికైనా నా మాట విని మారిపో. సొసైటీతోపాటు నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. ఇకపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయనని మాటివ్వు. ఈరోజే బ్యాంకాక్ నుంచి బయలుదేరి వచ్చేయ్. సజ్జనార్ సర్.. మీవల్ల చాలా కుటుంబాల భవిష్యత్తు బాగుంటుంది' అంటూ తనదైన స్టైల్ లో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది. 

Also read: BIG BREAKING: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు

ఇదిలా ఉంటే.. గతంలో హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మిత్రా శర్మ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆధారాలను సమర్పించి తన వద్ద రూ.2 కోట్లు తీసుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్షపై రేప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. 

Also read: Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబల్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు