Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వీడియోలను యూట్యూబర్ అన్వేష్ బయటపెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన సజ్జనార్ ప్రశాంత్‌పై కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమోట్ చేసే వాళ్లను వదిలేదే లేదు..
ఈ మేరకు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు దడ పుట్టిస్తున్న సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్లను వదిలేదే లేదంటు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలువురిపై సుమోటోగా కేసులు నమోదు చేయగా నెక్ట్స్ టార్గెట్ బిగ్‌బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వీడియోను ప్రముఖ యూట్యూబర్ అన్వేష్
ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన సజ్జనార్ రెండు,మూడు రోజుల్లో పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదయ్యే చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సన్ని యాదవ్, లోకల్ బాయ్ నానిలపై కేసులు నమోదవగా.. త్వరలోనే పరేషాన్ బాయ్స్, వినయ్ కుయ్యాపైనా కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?
ఇదిలా ఉంటే.. బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ కేసుపై అతని తల్లిదండ్రులు స్పందించారు. సూర్యాపేట నూతనకల్‌లోని సన్నీ ఇంటికి వెళ్లిన RTVతో సంచలన విషయాలు బయటపెట్టారు. భూములు, మెడికల్ షాపులతో పాటు చాలా ఆస్తులున్నాయని సన్నీ తండ్రి రవిందర్ చెప్పారు. తమకు వ్యవసాయ భూములున్నాయని, మెడికల్ షాప్ నడిపిస్తున్నామని చెప్పారు. అందులోనుంచే వచ్చిన డబ్బులతోనే ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన డబ్బులతో ఇళ్లు కడుతున్నారనే చెప్పేదంతా అబద్ధం అన్నారు. కొత్త ఇంటిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!