ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. మేము తెలంగాణకు నిధులిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి నిధులు పంపుతున్నారంటూ విమర్శించారు. నేను ఏరోజు కూడా తల వంచుకునే పనులు చేయనని.. కొందరు కావాలనే నాపై కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను అతడు వేధిస్తున్నాడంటూ ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీంతో కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కూడా విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు.
BREAKING: ' నాపై తప్పుడు ప్రచారాలు నమ్మకండన్నా'.. తల వంచుకునే పనులు చేయను: బండి సంజయ్
కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నేను ఏరోజు కూడా తల వంచుకునే పనులు చేయనని.. కొందరు కావాలనే నాపై కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
Bandi Sanjay