KPHB : హైదరాబాద్‌లో ఆ ప్లాట్ల వేలం రద్దు.. వారికి నోటీసులు జారీ

హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్నవారు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు డిసైడ్ అయింది.ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది.

New Update
 Kukatpally Housing Board Colony

Kukatpally Housing Board Colony

KPHB : హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.గతేడాది ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్న కొందరు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు తాజాగా డిసైడ్ అయింది. గతేడాది డిసెంబరులో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో మిగిలిన ప్లాట్లను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 72 ప్లాట్లను వేలం వేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 44 ప్లాట్లకు మాత్రమే వేలం వేశారు. వాటిలో కేవలం 19 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

Also Read: రూ.10లక్షల కోట్లతో.. 25వేల కి.మీ రోడ్లు : నితిన్ గడ్కరీ

పశ్చిమ జోన్‌లో మెుత్తం 12 ప్లాట్లు అమ్ముడుపోగా.. వాటిలో 9 ప్లాట్ల వేలం రద్దు చేయాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. రూల్స్ ప్రకారం.. వేలంలో ప్లాటు దక్కించుకున్న వారు అయిదు రోజుల్లో 25 శాతం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన డబ్బు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. కానీ ముగ్గురు మాత్రమే పూర్తి డబ్బును చెల్లించారు. మిగిలిన వారు కొంత డబ్బు కట్టి వేలంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వేలంపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పు వచ్చాక రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు అనుకుంటున్నారు. వేలం జరిగి రెండు నెలలు అయినా.. 9 మంది 25 శాతం కూడా డబ్బు కట్టలేదు. అందుకే ఆ ప్లాట్ల వేలం రద్దు చేయాలని తాజాగా నిర్ణయించారు. డబ్బులు చెల్లించిన వారికి నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.

Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?

 అయితే, హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంపై వివాదాలు నెలకొన్నాయి. గతేడాది వేలంపాట జరగ్గా.. ఫేజ్-15 నివాసితులు వ్యతిరేకించారు. వారు ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వేలం వేసిన భూమిలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణ కోసం కేటాయించారని.. నిబంధనలను ఉల్లంఘించి ప్లాట్లను విక్రయిస్తున్నారని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మొదట 80 నుండి 100 అడుగులకు రహదారిని విస్తరించాలని అనుకున్నా ప్రతిపాదిత రహదారిలోని 10 అడుగులను అమ్మకానికి పెట్టారని పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు పూర్తయిన తర్వాత ప్లాట్లు దక్కించుకున్నవారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: అలా ఎలా చిక్కావమ్మా.. ఒక్క వాట్సాప్‌ కాల్‌తో టీచర్‌ నుంచి రూ.78 లక్షలు మింగేసిన కేటుగాళ్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు