/rtv/media/media_files/2025/02/21/YxrADq8v1t4PdAGjswA4.jpg)
Murder in Warangal
Murder in Warangal: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. కొంత మంది గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై వెళుతున్న సుమంత్ కారును అడ్డుకొని, అందులో ప్రయాణిస్తున్న ఆయనను కిందికి దించి ఇనుప రాడ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల లొల్లి.. అసలేంటి వివాదం ?
వరంగల్ - బట్టుపల్లి(Warangal - Battupally) ప్రధాన రహదారి పై కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు ముగ్గురు వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన దారిలోనే మృతి చెందాడు. దీంతో మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Eknath Shinde: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే.. ఏమన్నారంటే ?
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ...
కాగా దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న సుమంత్ రెడ్డిని స్థానికుల సహాయంతో పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అయితే దాడికి పాల్పడిన వారు ఎవరు... ఎందుకు అతనిని చంపాలని అనుకున్నారనే విషయాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ చేసిన తర్వాత ఈ ఘటనపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య జరిగి 24 గంటలు కాకముందే నడిరోడ్డుపై మరోవ్యక్తిని దుండగులు హత్య చేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!
ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!