Crime News : వరంగల్ జిల్లాలో దారుణం...యువతిపై గ్యాంగ్ రేప్..హత్య

వరంగల్ జిల్లాలో ఓ యువతి అనుమానస్పద మృతి తీవ్ర కలకలం సృష్టించింది. ఆమెను గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేశారని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. ఏకే తండాకు చెందిన 21 ఏళ్ల యువతిని రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు గంజాయి మత్తులో రేప్ చేసి చంపారని ఆరోపిస్తున్నారు.

New Update
FotoJet (14)

Gang rape of a young woman... Murder

 Crime News : వరంగల్ జిల్లాలో ఓ యువతి అనుమానస్పద మృతి తీవ్ర కలకలం సృష్టించింది. ఆమెను గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపేశారని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని ఏకే తండాకు చెందిన 21 ఏళ్ల యువతిని రావూరు తండాకు చెందిన నలుగురు యువకుల గంజాయి బ్యాచ్‌కిడ్నాప్‌ చేసి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఉరివేసి చంపారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రాయపర్తి మండల పరిధిలోని ఏ కే తండాకు చెందిన యువతి నిన్న రాత్రి తీవ్ర రక్తస్రావంతో అనుమానస్పద స్థితిలో మరణించింది. దీంతో మృతదేహాన్ని వర్ధన్నపేట మార్చురీకి తరలించారు. కాగా ఈ విఫయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. నిందితులను శిక్షించే దాకా పోస్టుమార్టం చేసేది లేదంటూ కుటుంబ సభ్యులు అని మార్చురీ ముందు ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యువకులు ఎల్లపుడు గంజాయి మత్తులో వుండేవారు అని ఆరోపిస్తున్న యువతి బంధువులు..వారిని యువకులని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేసేదాకా పోస్టుమార్టం చేయనివ్వం అంటూ ఆందోళనకు దిగారు. దీంతో వర్ధన్నపేట మార్చురీ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.  బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు