/rtv/media/media_files/2026/03/18/latest-news-in-telugu-2026-03-18-19-41-15.jpg)
Brother Killed Sister In Abdullapurmet: ఇటీవల కాలంలో బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. భార్యభర్తలు ఒకరినొకరు చంపుకోవడం, తల్లి పిల్లల్ని చంపడం,పిల్లలు తండ్రిని చంపడం సర్వసాధారణమై పోయాయి. ఈ ఘటనలతో మానవసంబంధాలు ప్రశార్థకంగా మారుతున్నాయి. అలాంటి ఘటనే హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ బాటసింగారంలో చోటు చేసుకుంది. అక్క చెడు తిరుగుళ్లు తిరుగుతుందని ఆరోపిస్తూ ఆమెను తమ్ముడు అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత చెరువులో పడేశాడు. అంత్యంత దారుణమైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ నగర శివారులోని బాటసింగారం గ్రామంలో జరిగిన ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తోడబుట్టిన అక్కనే అత్యంత కిరాతకంగా హత్య చేసి చెరువులో పడేశాడు ఓ తమ్ముడు. పోలీసుల కథనం ప్రకారం బాటసింగారానికి చెందిన పప్పురామ్ తన అక్క భర్త చనిపోవడంతో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని గమనించాడు. ఆమె ప్రవర్తన సరిగా లేదని, చెడు తిరుగుళ్లు తిరుగుతుందని గ్రహించాడు. దీంతో ఆమె ప్రవర్తన మార్చుకోమని పలుమార్లు చెప్పి చూశాడు. కానీ ఆమె వినలేదు. గత నెల 28న వారిద్దిరి మధ్య గొడవ జరిగింది. అది పెరిగి పెద్దదైంది. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో కోపంతో ఊగిపోయిన రాము ఆమెను చంపాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం ఆమె శరీరాన్ని ముక్కులుగా నరికి వాటిని తీసుకెళ్లి సమీపంలో ఉన్న చెరువులో పడేశాడు.
ఆ తర్వాత తనకేం తెలియనట్లు తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన అక్క కిరాణ షాపుకు వెళ్లి వస్తానని చెప్పి కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలంపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు,ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులకు పోలీసులకు ఆమెకు సంబంధించిన ఆనవాళ్లేవి కనిపించలేదు. రామ్ పై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించడంతో అసలు నిజం భయటపడింది. తన అక్కను తనే హత్య చేసినట్లు అంగీకరించాడు. అక్క ప్రవర్తన పై విసుకు చెందానని అందుకే హత్య చేశానని నిందితుడు వెల్లడించాడు. ఈ దారుణ ఘటనతో బాటసింగారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ్ముడే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంపై స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా, పోలీసులు మృతురాలి శరీర భాగాల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.ఈ మేరకు పప్పు రామ్‌పై కేసు నమోదు చేశారు.
Follow Us