Love Jihad : హైదరాబాద్‌ లో మరో లవ్‌ జిహాద్‌...హిందూ అమ్మాయిలే టార్గెట్..

హైదరాబాద్‌లో హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వలవేసి ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి చేస్తున్న లవ్‌ జిహాద్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కూకట్‌పల్లి ఘటన మరువక ముందే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (16)

love jihad in Hyderabad...Hindu girls are the target..

హైదరాబాద్‌లో హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వలవేసి ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి చేస్తున్న లవ్‌ జిహాద్‌(love-jihad) ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన ఘటన మరువక ముందే పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలకు దగ్గరై ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి చేస్తూ అమ్మాయిలను వేధిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు పోలీసులకు చిక్కడంతో ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

తాజాగా హైదరాబాద్‌(Hyderabad Love Jihad Case) లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిధిలో  హిందూ యువతులను టార్గెట్‌గా చేసుకుని, ప్రేమ పేరుతో వారిని ట్రాప్ చేస్తున్న జమీర్, అతని తమ్ముడు మిరాజ్ లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పంజాగుట్టకు చెందిన జమీర్,మిరాజ్ లు అన్నదమ్ములు. వీరిద్దరూ  కలిసి పక్కాప్లాన్‌తో హిందూ యువతులను టార్గెట్‌గా చేసుకుని ప్రేమ పేరుతో మోసం(Love Jihad Trap) చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ  ఇద్దరూ అన్నదమ్ములు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు ఐదుగురు హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసినట్లు తెలుస్తోంది. మోస పోయిన అమ్మాయిలు బయటకు వస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అన్న అయిన జమీర్‌పై ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పలు తీవ్రమైన నేరారోపణలతో కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. అయినా వారు తమ బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయారు.   

Also Read :  తెలంగాణ డాక్టర్ల నియామ‌కంలో అక్రమాలు...టీడీఎఫ్ సంచలన ఆరోపణలు

Another Love Jihad In Hyderabad

జమీర్ లాగే తమ్ముడు మిరాజ్ కూడా ఇదే తరహాలో హిందూ యువతులను ట్రాప్ చేయడంలో సిద్ధహస్తుడు అని తెలుస్తోంది. అతను కూడా పలువురు యువతులను ట్రాప్‌ చేసి వారిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.   

పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ జమీర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. తిరిగి అదే రీతిలో హిందూ యువతులను టార్గెట్‌గా చేసుకున్నాడు. తాజాగా మరో యువతిని తన ప్రేమ వలలో వేసుకున్నాడు. బాధితురాలిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న నిందితుడు, ఆపై ఆమెను మతం మార్చుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాక ఆ యువతిని భయపెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పలువురు యువతులను ప్రేమ పేరుతో వంచిస్తున్న విషయం వెలుగు చూసింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులు ఎంతమందిని మోసం చేశారు?, వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో  పూర్తిస్థాయిలో  ఆరా తీస్తున్నారు. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని భయపడుతున్న బాధితులకు పోలీసులు రక్షణ కల్పిస్తామని నమ్మకం కలిగిస్తున్నారు. కాగా వారి చేతిలో మోస పోయిన యువతులు ముందుకు వస్తే మరిన్ని దారుణాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Also Read :  వరంగల్ జిల్లాలో దారుణం... యువతిపై గ్యాంగ్ రేప్.. హత్య

Advertisment
తాజా కథనాలు