Ameenpur 3 Children Case: వీడే.. వీడే ఆ ప్రియుడు.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది వీడికోసమే- ఫొటోలు వైరల్!

అమీన్‌పూర్‌లో ఇటీవల దారుణం జరిగింది. ప్రియుడి కోసం రజిత అనే మహిళ తన ముగ్గురు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది. తాజాగా రజిత, ప్రియుడు శివను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అతడు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.

New Update
Ameenpur 3 Children Case rajitha boyfriend shiva photo viral

Ameenpur 3 Children Case rajitha boyfriend shiva photo viral

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి ఏకంగా తన కన్న బిడ్డలకు విషమిచ్చి చంపిన ఘటన ఇటీవల అమీన్పూర్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు బయటకువస్తున్నాయి. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం, ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

దీంతో తననుపెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడు శివ ముందు ప్రపొజల్ పెట్టింది రజిత. అతడు దానికి కొన్ని కండీషన్లు పెట్టాడు. ‘నాతో జీవించాలనుకుంటే నీ పిల్లలను చంపేయ్, ఆ తర్వాత నీ భర్త మీదకు నెడితే అతడే జైలుకు వెళ్తాడు’ అని ప్రియుడు శివ ఆమెకు సూచించాడు. దీంతో ప్రియుడి మాటలు విన్న రజిత తన కన్న బిడ్డలకు పెరుగు అన్నంలో విషమిచ్చి చంపేసింది.

అనంతరం భర్తను ఇరికించే క్రమంలో ప్రియుడు శివ, రజిత పోలీసులకు దొరికిపోయారు. వీరిద్దరినీ సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే రజిత ప్రియుడు శివ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో అతడు గుబురు గడ్డంతో, ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని కనిపిస్తున్నాడు. 

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

జరిగిన కథ మొత్తం ఇదే

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. మీన్​పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్​లావణ్య కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్​(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడు. రజితకు, చెన్నయ్యకు 20ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

గెట్ టు గెదర్ పార్టీలో శివతో పరిచయం 

అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరిగింది. నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం,ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో, ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని రజిత భావించింది. ఇందుకోసం తననుపెళ్లి చేసుకోవాలంటూ శివ ముందు ప్రపొజల్ పెట్టింది. ఒకవేళ నీకుపెళ్లి కాకపోయి, పిల్లలు లేకుండా ఉంటే.. కచ్చి తంగా తానుపెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. దీంతో భర్త, పిల్లల అడ్డు తొలిగించుకుని ప్రియుడితో సుఖంగా ఉండాలని రజిత స్కె్చ్ వేసింది. 2025 మార్చి 27న సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పింది రజిత. ఆ పని త్వరగా పూర్తి చేయాలన్నాడు శివ. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ప్లాన్ లో భాగంగా పెరుగులో విషం

ప్లాన్ లో భాగంగా రజిత పెరుగులో విషం కలిపింది. పిల్లలకు పెరుగుతో అన్నం పెట్టింది.  భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే అన్న తిని ఫోన్ రావడంతో పనికోసం బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగాఉందంటూ నాటకం ఆడింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు చెన్నయ్య .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే హంతకురాలిని తేల్చారు. రజిత ఆమె ప్రియుడు శివను  కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

(rajitha | latest-telugu-news | murder-news | telugu-news | Ameenpur case | ameenpur )

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment