CM Revanth Davos Tour: తెలంగాణకు అమెజాన్‌ బంపరాఫర్.. వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం

తెలంగాణలో పెట్టుబడుల పంట పండనుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.

author-image
By K Mohan
New Update
amazon telangana

amazon telangana Photograph: (amazon telangana)

CM Revanth Davos Tour: దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణలో పెట్టుబడుల పంట పండింది. గ్రేటర్ హైదరాబాద్‌ వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షింస్తోంది. పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీల కళ్లన్నీ భాగ్యనగరం మీదనే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో రూ.60వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

Also Read: బ్యాంకుకు రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత

అమెజాన్‌ బంపరాఫర్.. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. దాదాపు రూ.60వేల కోట్ల ఇన్‌వెస్ట్‌మెంట్స్‌తో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి.

Also Read: ప్రభుత్వం గుడ్ న్యూస్.. విప్రోలో 5000 ఉద్యోగాలు

తెలంగాణలో క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.

Also Read: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్‌తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.

Also Read :  Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు