/rtv/media/media_files/2025/03/15/yW3GWBkTgxKHqugu6Viz.jpg)
aghori Photograph: (aghori )
BREAKING: తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సంచలనం రేపుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్‌తో జోగులాంబ ఆలయానికి వెళ్తున్న నాగసాధువును ఉండవల్లి బైరాపురం వద్ద పోలీసుల బృందం అడ్డుకుని కారుతోపాటు ఈడ్చుకెళ్లింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో లేడి అఘోరి హల్ చల్..
— RTV (@RTVnewsnetwork) March 15, 2025
అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శాలి పైల్వాన్ దర్గాను తొలగిస్తానని కామెంట్ చేసిన నాగసాధు అఘోరీ..
నేడు అలంపూర్ వెళ్తున్న అఘోరిను అడ్డుకున్న పోలీసులు..
ఉండవెల్లి మండలం బైరాపురం చౌరస్తా దగ్గర ఆఘోరీ… pic.twitter.com/zZfKCSNdGA
దర్గా కూల్చివేయాలంటూ..
ఈ మేరకు అలంపూర్‌లోని 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శాలి పహిల్వాన్ దర్గాను తొలగించాలని డిమాండ్ చేస్తోంది అఘోరి. ఇందులో భాగంగానే అలంపూర్ వెళ్తున్న అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. ఉండవెల్లి మండలం బైరాపురం చౌరస్తా దగ్గర ఆఘోరీ నాగసాధువును కారుతోపాటు ఈడ్చుకెళ్లారు. పోలీసులతో కాసేపు వాగ్వాదం పెట్టుకున్న అఘోరి.. హల్ చల్ చేసింది. దీంతో అఘోరి కార్ ను టోయింగ్ వాహనంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
ఇక 700 సంవత్సరాల చరిత్ర కలిగిన శాలి పహిల్వాన్ దర్గాను తొలగించాలంటూ అఘోరీ నాగ సాధువు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీంతో శాంతి భద్రతలు ఆగాథం తలెత్తకుండా ముందస్తుగా అఘోరీని అలంపూర్ ఆలయాలకు రాకుండా అడ్డుకుని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అఘోరీ కారులో విగ్రహాలు, పూజలకు సంబంధించిన సామాగ్రి ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఈ అరెస్టు ఇష్యూలో సీఐలు, ఇద్దరు మహిళ ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...