GHMC MAYOR : గ్రేటర్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం చేజారడంతో నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఫిబ్రవరి 10 నాటికి కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లవుతుండటంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

author-image
By Madhukar Vydhyula
New Update
ghmc

ghmc Photograph: ( )

GHMC MAYOR: గడచిన రెండు ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీపై పట్టు నిలుపుకున్న బీఆర్‌ఎస్‌ మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం చేజారడంతో నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే వచ్చే నెల 10 నాటికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగి నాలుగేళ్లవుతుండటంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

Also Read: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

మేయర్ పై అవిశ్వాస తీర్మానం

రాష్ట్రంలో అధికారం చేజారినప్పటికీ బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీలో మాత్రం తన పట్టు నిలుపుకుంటూ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. అయినప్పటికీ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే జీహెచ్ఎంసీ కౌన్సిల్ నాలుగేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 11న ముగుస్తుంది. దీంతో మేయర్ డిప్యూటీ మేయర్ ల పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.  ఇటీవల గ్రేటర్ బీఆర్ఎస్ నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమయంలో అవిశ్వాస విషయం చర్చకు వచ్చింది.  

Also Read: బ్యాంకుకు రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత


 కౌన్సిల్‌లో అవిశ్వాసం పెట్టాలంటే సగం శాతం మంది సభ్యుల బలం ఉండాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 196 మంది సభ్యులు ఉన్నారు. 50శాతం మద్దతు అవసరమంటే ఈ తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకం అవసరం. 98 మంది తీర్మానానికి అనుకూలంగా సంతకాలు పెడితే దాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు పంపిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే, మేయర్ తోపాటు డిప్యూటీ మేయర్ వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది.. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు మాత్రమేఉన్నారు. ఇక వివిధ పార్టీలకు చెందిన 50 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. అంటే మొత్తం 196 మంది సభ్యులలో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Also Read :  GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!

 కాగా జీహెచ్‌ఎంసీలో  బీఆర్ఎస్‌కు 42  మంది కార్పొరేటర్లు, 11 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్సీలు, 3 మంది రాజ్యసభ సభ్యలతో కలిపి 62 మంది సభ్యుల బలం ఉంది. అదే సమయంలో గతంలో బీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు 41 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌ అపిషియో  సభ్యులున్నారు. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఉంటే అవిశ్వాసానికి అవకాశం ఉంది. అయితే ఈ మధ్య ఎంఐఎం కాంగ్రెస్‌తో జతకట్టినట్టు ప్రచారం సాగుతోంది. అలా అయితే అవిశ్వాసానికి బీఆర్‌ఎస్‌ బలం సరిపోదు. ఇక అవిశ్వాసానికి బీజేపీ కలిసి వస్తుందనుకుంటే బీజేపీకి 39మంది కార్పొరేటర్లు, 6 గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 45 మంది సంఖ్యాబలం ఉంది. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 131 మంది సభ్యలు బలం అవసరం. అ లెక్కన వీరి బలం సరిపోదు. దీంతో బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం వీగిపోయే అవకాశాలు లేకపోలేదు.

Also Read: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

 కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నది. బీఆర్ఎస్ అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఎంఐఎం కనుక మద్దతు ఇవ్వకపోతే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం బహిర్గతం అవుతుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ అవిశ్వాసానికి బీజేపీ మద్దతు ఇస్తే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం బయటపడుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అవిశ్వాసం తీర్మానం ఆసక్తికరంగా మారింది.  
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు