Adilabad Tiger News: ఆదిలాబాద్‌లో పెద్ద పులి కలకలం.. భయాందళనలో ప్రజలు

ఆదిలాబాద్‌లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ లారీ డ్రైవర్ అర్థరాత్రి తాంసి శివారులో అర్థరాత్రి సమయంలో వెళ్తుండగా.. పెద్ద పులి రోడ్డు దాటుతుంది. ఈ విషయాన్ని అటవీ సిబ్బందికి తెలియజేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు బిగించారు.

New Update
అసలు తిరుమలలో ఏం జరుగుతుంది?

tiger

Adilabad Tiger News: ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. భీంపూర్‌ మండలం తాంసి శివారులో అర్థరాత్రి ఒక్కసారిగా పెద్ద పులి కనిపించింది. పిప్పల్‌కోటి ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఓ లారీ డ్రైవర్‌ అర్థరాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా.. పులి కనిపించింది. అతను వాహనాన్ని ఆపి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?

జన సంచారం ఉన్న దగ్గరకు రాదని..

ఈ విషయాన్ని అతను అటవీశాఖ సిబ్బందికి తెలపగా.. బేస్‌ క్యాంపు బృందాలను రంగంలోకి దించాయి. అక్కడున్న ప్రాంతాలను పరిశీలించారు. రెండేళ్ల వయస్సు ఉన్న పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి పెన్‌ గంగ నది వైపు వెళ్లినట్లు తెలిపారు. అయితే జన సంచారం ఉన్న దగ్గరకు పులి రాలేదని, రాదని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగ ఉండాలని తెలిపారు. అలాగే పులి సంచరించిన ప్రాంతల్లో సీసీ కెమెరాలు కూడా బిగించారు.

ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

ఇది కూడా చూడండి: భట్టి vs  ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!

ఇది కూడా చూడండి:   సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment