Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!

తెలంగాణలోని మందుబాబులకు కిక్కెక్కించే వార్త వినిపించనుంది ఎక్సైజ్ శాఖ.37 కొత్త బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో 15 విదేశీ బ్రాండ్లు కాదు.. మరో 15 దేశీయ బ్రాండ్లుగా తెలుస్తోంది. ఇక మిగిలినవి కొత్త బీర్ల బ్రాండ్లుగా సమాచారం.

New Update
liquor

తెలంగాణలోని మందుబాబులకు తాగకుండానే కిక్కెక్కించే వార్త ఒకటి ప్రభుత్వం వినిపించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మార్కెట్‌లోకి 37 కొత్త బ్రాండ్లు రాబోతున్నాయంట. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం.. గత నెల 23న బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కొత్త సరఫరాదారుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది.

Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!

 దేశంలో తయారయ్యే మద్యం బ్రాండ్లలో 95 శాతం కంపెనీలు కార్పొరేషన్‌లో రిజిస్టర్‌‌ కాగా ప్రభుత్వ ప్రకటనతో.. సుమారు 10 కొత్త బ్రాండ్లు ముందుకొచ్చే అవకాశముందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేశాయి. కానీ.. ఊహించని విధంగా స్పందన లభించింది.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

ప్రభుత్వం విధించిన గడువు ముగిసే సమయానికి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఇందులో 15 విదేశీ  బ్రాండ్లు , మరో 15 దేశీయ బ్రాండ్లు, మరో ఏడు దరఖాస్తులు బీర్ల సరఫరాకు వచ్చాయి. ఈ జాబితాలో.. గతంలో వివాదాల్లో చిక్కుకున్న సోం డిస్టలరీస్‌ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే.. వచ్చిన దరఖాస్తులను అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే మద్యం సరఫరాకు ఒప్పందం చేసుకుంటామని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థల ట్రాక్‌ రికార్డును పరిశీలించడమే కాకుండా.. ఎంత ధరకు కోట్‌ చేసింది? ఆ బ్రాండు మద్యానికి ఇతర రాష్ట్రాలు ఎంత చెల్లిస్తున్నాయి? ఏ కేటగిరీలో ఆ బ్రాండు ఉంది? ఆ కేటగిరీకి మన రాష్ట్రంలో చెల్లిస్తున్న ధర ఎంత? ఒకవేళ సంస్థ కోట్‌ చేసిన ధరకు, ప్రభుత్వ ధరకు తేడా ఉంటే ఏం చేయాలి? ధరల నిర్ధారణ కమిటీకి ప్రతిపాదించాలా లేదా? అనే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. 

ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.కొత్త బ్రాండ్ల సరఫరాకు ఒప్పందాలు చేసుకునే సమయంలోనే మద్యం బేసిక్‌ ధరలను కూడా పెంచే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీర్ల బేసిక్‌ ధరను ప్రభుత్వం పెంచింది. కేవలం బీర్లు బేసిక్ ధరలను పెంచిన ప్రభుత్వం.. లిక్కర్‌ బేసిక్‌ ధరల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే.. లిక్కర్ బేసిక్‌ ధరను కూడా కేస్‌కు రూ.85 చొప్పున పెంచే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

బీర్ల బేసిక్‌ ధర పెంచటంతో.. బహిరంగ మార్కెట్‌లో బీర్ల రేట్లు కూడా పెరిగాయి. ఇక.. ఇప్పుడు లిక్కర్‌ బేసిక్‌ ధరలను పెంచితే.. మద్యం ధరలు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. అయితే.. లిక్కర్‌ ధరలు పెంచాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంచనాలను బట్టి ఉండనుంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని సర్కార్ అంచనా వేయగా.. వచ్చే బడ్జెట్‌లో రూ.30 వేల కోట్ల వరకు వెళ్తే మాత్రం లిక్కర్‌ ధరలు పెంచక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు