New Year 2024 : న్యూ ఇయర్‌ వేళ కిక్కే కిక్కు.. మూడ్రోజుల్లో ఎంత తాగేశారంటే

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా యువతరం మత్తులో మునిగితేలింది. మూడు రోజుల్లోనే రూ. 658 కోట్ల రూపాయల లిక్కర్‌ అమ్మకాలు జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ 1241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

New Update
New Year 2024 : న్యూ ఇయర్‌ వేళ కిక్కే కిక్కు.. మూడ్రోజుల్లో ఎంత తాగేశారంటే

New Year 2024 Celebrations : న్యూ ఇయర్(New Year) వేళ జనం ఫుల్ జోషులో ఉన్నారు. 2023కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి హ్యాపీగా స్వాగతం పలికారు. ఈ యేడాది పలు కొత్త పనులను ప్రారంభించడంతోపాటు, శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు. అయితే యువత మాత్రం మత్తులో మునిగిపోయింది. మూడ్రోజులుగా పార్టీ (Party) ల పేరుతో తాగి ఊగిపోతున్నారు. తెలంగాణ(Telangana) లో గతేడాదికంటే ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా లిక్కర్(Liquor) అమ్మకాలతో రాష్ట్రానికి భారీ ఖజానా చేకూరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఈ మూడ్రోజుల్లో రూ. 658 కోట్ల రూపాయల లిక్కర్‌ అమ్మకాలు జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 29, 30, 31 తేదీల్లో భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయని, ఇప్పటి వరకూ 6.31 లక్షల బీర్‌ కేసుల విక్రయించినట్లు చెప్పారు. ఇక రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్ల నిర్వహణకు పర్మిషన్‌ ఇవ్వడంతో లిక్కర్‌ సేల్స్‌ పుంజుకున్నాయని, కేవలం 30 తారీఖు ఒక్కరోజే రూ. 313 కోట్ల లిక్కర్‌ అమ్ముడు పోయినట్లు వెల్లడించారు. అలాగే ఈ 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కు సంబంధించిన పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Akshay Kumar : సెలబ్రిటీలను చూసి మోసపోవద్దు.. అక్షయ్ ఆసక్తికర కామెంట్స్ వైరల్

ఇక రాత్రి 8 గంటలనుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా.. హైదరబాద్ (Hyderabad) లోని సైబరాబాద్‌ (Cyberabad) పోలీస్ స్టేషన్ పరిధిలోనే భారీగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ (Drunk and Drive) కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మొత్తం మూడు రోజులుగా 1241 కేసులు నమోదు చేశామని, అత్యధికంగా మియాపూర్‌లో 253 కేసులు నమోదైనట్లు సైబరాబాద్‌ అధికారులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు