Free Current: ఫ్రీ కరెంట్‌ కు రెండు కండీషన్స్‌.. మళ్లీ అప్లై ఎలా అంటే!

ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డు , కరెంట్ కనెక్షన్‌ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు.

New Update
Free Current: ఫ్రీ కరెంట్‌ కు రెండు కండీషన్స్‌.. మళ్లీ అప్లై ఎలా అంటే!

Telangana: తెలంగాణ(Telangana) లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్(Congress)  ప్రభుత్వం దానికి తగినట్లుగానే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. తాజాగా మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్,(Free Current)  రూ. 500 కే గ్యాస్ సిలిండర్‌ పథకాలను అందించేందుకు సిద్దమయ్యింది. అయితే ఉచిత విద్యుత్ కావాలంటే మాత్రం కండిషన్స్‌ అప్లై అంటూ ట్విస్ట్‌ ఇచ్చింది. ఫ్రీ కరెంట్ కు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అని తేల్చి చెప్పింది. ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్‌ కార్డ్‌(Ration Card), ఆధార్‌ కార్డు(Aadhara Card) , కరెంట్ కనెక్షన్‌ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని వివరించింది.

విద్యుత్ బిల్లులో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌ ని పొందొచ్చని తెలిపింది. అంతకు మించితే మాత్రం పూర్తి బిల్లు చెల్లించాల్సిందేనని వివరించింది. అలాగే 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు. ఈ జీరో బిల్లుల జారీ వచ్చే నెల మొదటి వారం నుంచే అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.

జీరో బిల్లులకు సంబంధించిన బిల్లుల మొత్తాన్ని 20 వ తేదీకల్లా డిస్కంలకు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం. అలాగే అర్హులైన వారు ఇంటి వినియోగానికి మాత్రమే ఫ్రీ కరెంట్‌ అని..దానిని ఇతర అవసరాలకు వాడుకుంటే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఉచిత విద్యుత్ కు సంబంధించి ఎంపీడీవో, మున్సిపల్‌, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న తరువాత ఆ రసీదును సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలని అధికారులు తెలిపారు. ఆ తరువాత రేషన్‌ కార్డ్‌, ఆధార్‌ వివరాలను పరిశీలించి అర్హులైతే గృహాజ్యోతి పథకాన్ని వర్తింప చేస్తామని అధికారులు వెల్లడించారు.

ప్రజాపాలనల్ ఉచిత విద్యుత్‌ కోసం ఇప్పటి వరకు 81.54 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించిన అధికారులు. వాటిలో రేషన్‌ కార్డులేని ఆర్జీలను పక్కనపెడుతున్న అధికారులు. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో సుమారు 49. 50 లక్షల ఇళ్లకు కరెంట్‌ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వాటిలో 19. 85 లక్షల మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు. మార్చిలో 40 నుంచి 60 లక్షల ఇళ్లకు జీరో బిల్లులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 200 యూనిట్ల కరెంట్‌ ను వాడుకునే ఇంటికి దాదాపు రూ. 900 వరకు ఆదా అవుతుందని ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు.

Also read: మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: డ్రెస్ మార్చింది.. విజయం కొట్టింది- RCB ఖాతాలో మరో గెలుపు

బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

New Update
RCB VS RR

RCB VS RR Photograph: (RCB VS RR)

బెంగళూరు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. ఎలాంటి ఉరుములు లేవు.. ఎలాంటి మెరుపులు లేవు.. కానీ తుఫాన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

Advertisment
Advertisment
Advertisment