Sarvam Kaze: మోదీ ధరించిన ఆ స్మార్ట్ గ్లాసెస్.. చూస్తే రాస్తుంది, చెప్తే వింటోంది

ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సర్వం ఏఐ అనే స్టార్టప్ తయారు చేసిన సర్వం కేజ్ అనే AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను ఆయన పెట్టుకున్నారు. వాటి పనితీరును స్వయంగా పరీక్షించారు.

New Update
Sarvam Craze

భారతీయ స్టార్టప్ రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి మోదీ(prime-minister-modi) ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ(Sarvam AI) అనే స్టార్టప్ తయారు చేసిన సర్వం కేజ్ అనే ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌(Sarvam Kaze Glasses) ను ఆయన పెట్టుకున్నారు. వాటి పనితీరును స్వయంగా పరీక్షించారు.

సర్వం ఏఐ కో ఫౌండర్, సీఈఓ ప్రత్యూష్ కుమార్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి గర్వపడ్డారు. "మా స్వదేశీ డివైస్ ధరించిన మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి కావడం మాకు దక్కిన అతిపెద్ద గౌరవం" అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్, కృత్రిమ మేధస్సును కంప్యూటర్ స్క్రీన్ల నుండి నిజ జీవితంలోకి తీసుకువస్తాయని ఆయన వివరించారు.

Also Read :  పెళ్లి వేడుకలో వధువుపై రూ.8 కోట్ల నోట్ల వర్షం ? వీడియో వైరల్..

ఏమిటీ 'సర్వం కేజ్'?

సాధారణ కళ్లద్దాల మాదిరిగానే కనిపించే ఈ సర్వం కేజ్‌లో లెటెస్ట్ టెక్నాలజీ ఉంది. 
వినడం, అర్థం చేసుకోవడం: వినియోగదారుడు చెప్పే మాటలను విని, ఏఐ సహాయంతో అర్థం చేసుకుంటుంది.
రియల్ టైమ్ స్పందన: మనం అడిగే ప్రశ్నలకు ఈ అద్దాలు తక్షణమే సమాధానాలు ఇస్తాయి.
విజువల్ క్యాప్చర్: ఇందులో అమర్చిన కెమెరా ద్వారా మన కళ్ల ముందు కనిపించే దృశ్యాలను అనాలసిస్ చేస్తాయి.
భారతీయ భాషలు: ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లో కూడా ఇది పనిచేసేలా రూపొందించారు.

ప్రస్తుతం ఈ గ్లాసెస్ ఎక్స్‌పర్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి. ప్రత్యూష్ కుమార్ చెప్పిన దాని ప్రకారం, మే 2026 నాటికి ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మెటా రే-బాన్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు ధీటుగా, పూర్తిగా భారతీయ అవసరాలకు అనుగుణంగా వీటిని తక్కువ ఖర్చుతో అందించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి అధునాతన ఆవిష్కరణలు రావడం భారత్ టెక్ రంగంలో ప్రపంచ దేశాలకు సవాలు విసురుతోందని చెప్పవచ్చు. ప్రధాని మోదీ స్వయంగా వీటిని ప్రోత్సహించడం భారతీయ ఏఐ స్టార్టప్‌లకు గొప్ప ఉత్సాహాన్నిస్తోంది.

Also Read :  మరీ ఇంత దిగజారిపోయారా.. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో దొంగతనం

Advertisment
తాజా కథనాలు