/rtv/media/media_files/2025/03/28/rOWJVxjkWXNBFvGOVdVV.jpg)
IPHONE PRICE DROP
Ugadi IPhone Offers:
ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. ఎప్పటికైనా ఐఫోన్ కొని వాడాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అధిక ధర కారణంగా వెనక్కి అడుగులు వేస్తుంటారు. ఎప్పుడైనా ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటే అప్పుడు కొనుక్కుందాంలే అని ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా అలాంటి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే అదిరిపోయే సేల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఐఫోన్ 15పై కళ్లు చెదిరే డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా భారీ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. అమెజాన్ ప్రస్తుతం ఐఫోన్ 15 - 512GB వేరియంట్ పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
Also Read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
IPHONE 15- 512GB Discount
ఐఫోన్ 15- 512GB వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,09,900 కు లిస్ట్ అయింది. ఇప్పుడు దానిపై భారీ డిస్కౌంట్ ఉంది. దాదాపు 23 శాతం ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుతో దీని ధర కేవలం రూ. 84,999 కి తగ్గుతుంది. అంటే ఈ డిస్కౌంట్ ద్వారా నేరుగా రూ. 25,000 తగ్గింపు లభించిందన్నమాట. అంతేకాకుండా రూ.2,549 వరకు క్యాష్‌బ్యాక్‌తో కూడిన గొప్ప బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో ఈ వేరియంట్ ధర మరింత తగ్గుతుంది.
Also Read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!
ఇవి మాత్రమే కాకుండా అమెజాన్ అదనంగా ఈ వేరియంట్ కొనుగోలుపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాదాపు రూ. 22,800 వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ డిస్కౌంట్ పాత మొబైల్ మోడల్ బట్టి ఉంటుంది. అలాగే ఎలాంటి డ్యామేజ్, హ్యాంగ్ వంటి సమస్యలు ఉండకూడదు. దీంతో పూర్తి ఎక్స్ఛేంజ్ వర్తిస్తే.. ఈ ఫోన్‌ను కేవలం రూ.59,650లకే కొనుక్కోవచ్చు.
ఒకవేళ ఈ అమౌంట్ మరీ ఎక్కువ అనిపిస్తే.. మీకు మరో ఆప్షన్ కూడా ఉంది. అమెజాన్ EMI ప్లాన్ కూడా అందిస్తోంది. దీని ద్వారా ఐఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. కేవలం రూ.4,121 నెలవారీ చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
iPhone 15 Specifications
iPhone 15 ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్టైలిష్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్‌కు మద్దతు ఇచ్చే 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది iPhone iOS 17లో నడుస్తుంది. భవిష్యత్తులో అప్‌గ్రేడ్ చేయబడుతుంది. ఇది శక్తివంతమైన Apple A16 బయోనిక్ చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుంది. iPhone 15- 6GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం.. ఇది 48+12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
(tech-news | telugu tech news | mobile-offers | latest-telugu-news | telugu-news UGADI 2025)