AI: 'కొవిడ్ కన్నా పెద్దది జరగబోతోంది'.. ఏఐపై హైప్‌రైటర్ సీఈవో సంచలన హెచ్చరిక

రాబోయే 12 నుంచి 18 నెలల్లో వైట్‌ కాలర్ ఉద్యోగాల్లో చాలావరకు ఆటోమేషన్ అయ్యే ఛాన్స్ ఉందని మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్‌ హెచ్చరించారు. తాజాగా హైపర్‌రైట్‌ సీఈవో మాట్‌ షుమార్‌ చేసిన ఏఐపై చేసిన హెచ్చరిక సంచలనం రేపుతోంది.

New Update
HyperWrite AI CEO Matt Shumer warns of AI dangers

HyperWrite AI CEO Matt Shumer warns of AI dangers

ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకి కొంతపుంతలు తొక్కుతోంది. అనేక కంపెనీలు ఏఐని వాడేస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్ లాంటి పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐ ఆటోమేషన్‌ కారణంగా లేఆఫ్‌ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్‌ ఏఐపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 12 నుంచి 18 నెలల్లో వైట్‌ కాలర్ ఉద్యోగాల్లో చాలావరకు ఆటోమేషన్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. కేవలం కోడర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మాత్రమమే కాకుండా కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసే అకౌంటెంట్లు, న్యాయవాదులు, ప్రాజెక్టు మేనేజర్లు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లపై కూడా ఏఐ ప్రభావం పడనుందని వార్నింగ్ ఇచ్చారు. 

Also read: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెలంగాణకు గుడ్‌న్యూస్

తాజాగా హైపర్‌రైట్‌ సీఈవో మాట్‌ షుమార్‌ చేసిన హెచ్చరిక సంచలనం రేపుతోంది. "సమ్‌థింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్" పేరుతో ఆయన రాసిన ఒక వ్యాసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ రాకను ఆయన కోవిడ్-19తో పోల్చారు. రాబోయే రోజుల్లో కోవిడ్ 19 కన్నీ పెద్దది ఏదో జరగనుందని రాసుకొచ్చారు. 2020 ఫిబ్రవరిలో కోవిడ్ గురించి  ప్రపంచం ఎలాగైతే ఇది పెద్ద సమస్య కాదు అని తేలికగా తీసుకుందో.. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా ప్రజలు అలాగే ఉన్నారని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో ఏఐ వల్ల జరగబోయే మార్పులు కోవిడ్ కన్నా చాలా పెద్దవిగా ఉంటాయని అంచనా వేశారు.

Also Read: 'త్రిషను వదిలేయ్ ముందు'.. విజయ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

స్క్రీన్ మీద చేసే ఏ ఉద్యోగమైనా అంటే సాఫ్ట్‌వేర్ కోడింగ్, రైటింగ్, లీగల్ వర్క్, అనాలిసిస్, కస్టమర్ సర్వీస్ లాంటివి ఏఐ వల్ల ప్రభావితం అవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలలో 50 శాతం వరకు త్వరలో కనుమరుగయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. పాత ఏఐ మోడల్స్ కేవలం సూచనలు మాత్రమే పాటించేవని తెలిపారు. కానీ ఇప్పుడు వస్తున్న GPT-5.3 Codex లాంటి కొత్త మోడల్స్‌కు ఏది సరైనదో గ్రహించే శక్తి కనిపిస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకే ఏఐని కేవలం గూగుల్ సెర్చ్ కి మాత్రమే వాడకుండా, ఓ టూల్‌గా ఉపయోగించడం నేర్చుకోవాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు