Flipkart Fridge Offers: వారెవ్వా.. రూ.4వేలలోపే 90లీటర్ల కొత్త ఫ్రిడ్జ్

అబ్బబ్బ.. ఎండ దంచికొడుతుంది. అలాంటి సమయంలో చల్ల చల్లని వాటర్/డ్రింక్ తాగితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే సమ్మగా ఉంది కదూ. మరి మీరు కూడా అలాంటి అనుభవాన్నే పొందాలనుకుంటే.. ఈ సీజన్‌లో బెస్ట్ అండ్ చీపెస్ట్ ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంది.

New Update
fridge offers

fridge offers

అబ్బబ్బ.. ఎండ దంచికొడుతుంది. అలాంటి సమయంలో చల్ల చల్లని వాటర్/డ్రింక్ తాగితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే సమ్మగా ఉంది కదూ. మరి మీరు కూడా అలాంటి అనుభవాన్నే పొందాలనుకుంటే.. ఈ సీజన్‌లో బెస్ట్ అండ్ చీపెస్ట్ ఫ్రిడ్జ్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫ్రిడ్జ్‌(Mini Fridge Offers) ను సొంతం చేసుకోవచ్చు. భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read :  వాట్సాప్ వాడే వారికి షాక్.. ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ బంద్..!

MarQ by Flipkart

ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధర(flipkart-offers) లో అందుబాటులో ఉన్న ఫ్రిడ్జ్ MarQ by Flipkart. ఇది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. 90 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది.  దీని అసలు ధర రూ.14,999 గా Flipkartలో లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు దీనిని 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,990లకే సొంతం చేసుకోవచ్చు. అంటే నేరుగా రూ.7,009 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే రూ.799 పొందొచ్చు. ఇంకా ఫ్లిప్‌‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డుపై రూ.400 లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందొచ్చు. ఐసీఐసీఐ, యాక్సెస్ వంటి క్రిడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. 

అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. దాదాపు రూ.3,770 వరకు పొందొచ్చు. ఈ మొత్తం ఆఫర్ వర్తిస్తే  MarQ by Flipkart ఫ్రిడ్జ్‌ను కేవలం రూ.4,220 లకే సొంతం చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్ కూడా యాడ్ చేసుకుంటే రూ.4వేల కంటే తక్కువకే పొందొచ్చు. 

Also Read :  మార్కెట్‌‌లోకి కొత్త సరుకు.. హువావే నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!

MarQ by Flipkart Specs

ఈ ఫ్రిడ్జ్(refrigerators) చిన్న ఫ్యామిలీలకు, బ్యాచిలర్లకు బాగుంటుంది. ఇది 90 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఇందులో డైరెక్ట్ కూల్ టెక్నాలజీ, రెసిప్రొకేటింగ్ కంప్రెసర్‌ ఉంటుంది. ఇది 20 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్‌కు సపరేట్‌గా3 స్టెబిలైజర్ అవసరం లేదు. అంతేకాకుండా బ్యాక్టిరియా చేరకుండా రిమూవబుల్ యాంటీ-బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, పిల్లల కోసం చైల్డ్ లాక్ వంటి సౌకర్యం ఉంది. ఈ ఫ్రిడ్జ్ 1స్టార్ రేటింగ్‌తో వస్తుంది. - latest technology news in telugu

Advertisment
తాజా కథనాలు