/rtv/media/media_files/2025/03/27/kvDkiM314hMU6d4bKGED.jpg)
Cheap Split ACs available flipkart here before Eid
వేసవి కాలం ప్రారంభమైంది. చాలా మంది ప్రజలు ఎయిర్ కూలర్, ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలోనే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ చీపెస్ట్ ఏసీల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఒక కొత్త AC కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. అదిరిపోయే సేల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ ఈద్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో ఏసీలపై భారీ తగ్గింపులు అందిస్తుంది. ఆ డిస్కౌంట్‌లతో సగం ధరకే ఏసీలను కొనుక్కోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
Voltas 1.5 Ton AC
వోల్టాస్ 1.5 టన్నుల ఎయిర్ కండీషనర్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మీరు దీనిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాదాపు 46% తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపుతో రూ.62,990 అసలు ధర ఉన్న ఈ ఏసీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.33,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే సగం ధరకే ఇది లభిస్తుందన్నమాట. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువకే AC కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.5,600 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
Marq By Flipkart 2025 Split
ఫ్లిప్‌కార్ట్‌లో ‘మార్క్ బై ఫ్లిప్‌కార్ట్ 2025 స్ప్లిట్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్‘ (Marq By Flipkart 2025 Split Inverter Air Conditioner) చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఏసీ 0.75 టన్నుతో 1 టర్బో కూల్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని ధర రూ.46,499 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.20,990లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పాత ఏసీని తిరిగి ఇస్తే రూ. 5,600 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Godrej 5-in-1-Convertible Cooling 2025 Model
గోద్రెజ్ 5-ఇన్-1-కన్వర్టబుల్ కూలింగ్ 2025 మోడల్ 1 టన్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ.30 వేల లోపే ఉంది. ఈ 3 స్టార్ రేటెడ్ AC కేవలం రూ.29,490కే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌ల క్రింద మరిన్ని తగ్గింపులను పొందవచ్చు. పాత AC ఇవ్వడం వల్ల కూడా తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ACపై రూ. 5,600 వరకు తగ్గింపు పొందొచ్చు.
(AC OFFERS | latest-telugu-news | telugu-news | tech-news | telugu tech news)