Hyderabad Crime: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిని మరో యువతి ద్వారా పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. By Bhavana 01 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad Crime: గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. పుప్పాలగూడలో ఓ కంపెనీలో యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఆమెను మరో యువతి ద్వారా సిద్దార్థ్ వర్మ పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించారు. దీంతో ఆ యువతిని బుధవారం రాత్రి భోజనానికి రమ్మని ఇంటికి పిలిచాడు. ఆ క్రమంలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించాడు. ఆ తరువాత ఆమె పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం గురించి బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. Also read: పారిస్ ఒలింపిక్స్ లో నేటి నుంచి అథ్లెటిక్స్..ఆశలన్నీ కూడా నీరజ్ పైనే! #short-film #puppalaguda #rape #director #women #hyderabad #software #gachibowli సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి