Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటన.. ఎప్పుడంటే ?
ఈ నెల 29న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన తర్వాత బీజీపీ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 29న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన తర్వాత బీజీపీ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే దానిపై అయోమయం అవుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో భార్యాభర్తలు కలిసి న్యూడ్ వీడియోలతో వ్యాపారం చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఒక్కో లైవ్ లింక్‌కు రూ.2 వేలు, వీడియోకు రూ.500 వసూళ్లు చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది.
తెలంగాణలో నేటి నుంచి బోనాల జాతర ప్రారంభం కానుంది. ఈ బోనాలకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. తెలంగాణలో మొదటి బోనం గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత బల్కంపేట రేణుకా ఎల్లమ్మకి ఇస్తారు.
మంచిర్యాలలో సంతూర్ సోప్‌లతో వెళ్తున్న ఒక లారీ ఇంకో లారీని ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందులోని సబ్బులు రోడ్డు మీద పడటంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బాధితుల కోసం కాకుండా సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారని కొందరు మండిపడుతున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ లోని దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. వీరు కోనసీమ జిల్లాకు చెందిన ఐస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.