Amrapali: అమ్రపాలికి ఊరట.. మళ్లీ తెలంగాణకు షిఫ్ట్
ఐఏఎస్ ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్లో చేరిన ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్లో చేరిన ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ అభ్యర్థులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలు జూన్ 25న (బుధవారం) విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పింది.
బీజేపీ లీడర్, మెదక్ ఎంపీ రఘునంధన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రం లోగా చంపేస్తామంటూ రఘునంధన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టులు కాల్ చేసి మరీ బెదిరించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. 15 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి సోమవారం రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మరో రూ.513.83 కోట్లు నిధులు విడుదలవుతాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ కింద మొదటి విడుదలో భాగంగా తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చేనాటికి పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు.