BIG BREAKING: తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!
తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు ఎస్ఈసీ రాణికుముదిని వెల్లడించారు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు ఎస్ఈసీ రాణికుముదిని వెల్లడించారు.
గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకునేందుకు బతుకమ్మ సిద్ధమైంది. ఒకేసారి 10 వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు చోటు సంపాదించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, నిజమాబాద్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు మరోసారి ముందంజలో నిలిచాయి. కాగా మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం (FY25)లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో 58శాతం రాబడి ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చిందని తేలింది.
తెలంగాణ పోలీస్ బాస్‌గా రాష్ట్ర ప్రభుత్వం IPS శివధర్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఆయనకు శుక్రవారం నియామక పత్రం అందించారు. ఆయన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్లో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా IPSల బదిలీలు చేసింది. ఇందులో భాగంగా IPS సజ్జనార్ హైదరాబాద్ కమిషనర్‌గా నియమించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో సజ్జనార్‌కు అంటూ ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఏడు ఎన్కౌంటర్లు చేశారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ విధించింది.
వాయువ్య మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రానున్న 24 గంటలు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
RRR దక్షిణ భాగం రోడ్డు కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు భూనిర్వాసితులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ ను మార్చారని, దివిస్ కంపెనీకి లాభం చేకూరేలా చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.