Tamilnadu: భార్య చికెన్ తినలేదని భర్త ఆత్మహత్య
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది.
ఆరు రోజులుగా అదృశ్యమైన త్రిపురకు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహా దేబ్నాథ్ (19) మృతదేహం ఆదివారం యమునా నదిలో లభ్యమైంది. ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య లేఖ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. భార్యభర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. అయితే దీన్ని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యూపీ లక్నోలో ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆన్లైన్ లైవ్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 36 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల్లో ఉన్న ఓ వ్యాపారి.. ఎవరైనా ముందుకు వచ్చి తనని ఆదుకోవాలని వేడుకున్నాడు.
ముంబైలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఉంటున్న ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్మోర్ ఆత్మహత్య చేసుకున్నారు. సబా ఖురేషి, రాహుల్ పర్న్వానీ అనే ఇద్దరు వ్యక్తులు అడల్ట్ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలతోనే సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు.
సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్లో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది.
స్నేహితురాళ్లు అవమానించారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న నిత్య చదువులో వెనుబడడంతో ఆమె స్నేహితురాళ్లు సంజన, వైష్ణవి అవమానించినట్లు మాట్లాడారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో ఓ యువకుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని ఓ గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఆ గ్రూప్లో కాస్త వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పు లేకుండా కేసు నమోదు చేశారని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.